వార్త ముఖ్యాంశాలు
- *మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్‌లో మన బాల్య తండా గ్రామపంచాయతీకి చెందిన నూతనంగా పెన్షన్లు మంజూరైన అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
- ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారు పాల్గొని నూతన పెన్షన్‌దారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు.
*మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్‌లో మన బాల్య తండా గ్రామపంచాయతీకి చెందిన నూతనంగా పెన్షన్లు మంజూరైన అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారు పాల్గొని నూతన పెన్షన్‌దారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ పెన్షన్ల మంజూరు ప్రక్రియలో మన బాల్య తండా గ్రామపంచాయతీకి చెందిన అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందించాలనే సంకల్పంతో, వారికి దగ్గరుండి అవసరమైన సహకారం అందిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పెన్షన్లు మంజూరయ్యేలా నా వంతు కృషి చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.
ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఈ రోజు లబ్ధిదారుల చేతుల్లో పెన్షన్ మంజూరు పత్రాలు చూడటం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసాను కల్పిస్తాయి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మన బాల్య తండా గ్రామపంచాయతీ కార్యదర్శి గారికి, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే జిల్లా స్పెషల్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ రెడ్డి గారికి, డీపీఓ గారికి, ఎంపీడీఓ గారికి, వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేయడమే నా లక్ష్యం.
ప్రజాసేవే పరమావధిగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతాను.
🙏 మీ ఆదరాభిమానాలకు, సహకారానికి ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
మీ
విజయ్ నాయక్
మహబూబాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
పున్నమి రిపోర్టర్
రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్