చింతకాని / ఖమ్మం
ఖమ్మం జిల్లా చింతకాని మండలం చింతకాని గ్రామానికి చెందిన 17 మంది ఎస్సీ మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూముల్లో నారాపోగు వెంకట్రావమ్మ వరి నాట్లు వేయగా, గ్రామానికి చెందిన మహిళలు వాటిని ధ్వంసం చేశారని ఫిర్యాదు అందినట్లు చెప్పారు. వరి నాట్లను అడ్డుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. పొలంలో వరి పంటను ధ్వంసం చేయడంతో సుమారు రూ.95 వేల నష్టం వాటిల్లిందని వెంకట్రావమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ పున్నమి న్యూస్‌కు తెలిపారు.



