Wednesday, 2 September 2026
  • Home  
  • వడ్లపూడి RH కాలనీ, కూర్మన్నపాలెం ప్రజలకు బొండా యల్లాజీ రావు – బొండా శ్రీదేవి నమస్సుమాంజలులు 🙏
- విశాఖపట్నం

వడ్లపూడి RH కాలనీ, కూర్మన్నపాలెం ప్రజలకు బొండా యల్లాజీ రావు – బొండా శ్రీదేవి నమస్సుమాంజలులు 🙏

మేము గత 41 సంవత్సరాలుగా వడ్లపూడి RH కాలనీ, కూర్మన్నపాలెం పరిసర ప్రాంత ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశాము. ముఖ్యంగా *స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, మురికివాడల అభివృద్ధి, గణపతి కాలనీ, NTR నగర్, రాజాలమ్మ కాలనీ* సమస్యలపై, అలాగే *రాయల చెరువు పరిరక్షణ* కొరకు నిరంతరం పోరాడాము. ఈ విషయాలన్నీ మీకు విదితమే. గ్రీన్ బెల్ట్ స్థలం కోసం జరిగిన పోరాటంలో మేము అనేక పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నాము. ఆ సమయంలో యల్లాజీ రావు అండర్ గ్రౌండ్ లో ఉండగా, చంటి పిల్లలతో శ్రీదేవి ఎదుర్కొన్న దయనీయ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ప్రస్తుతం ప్రజా అనుకూల ప్రభుత్వం రావడం వలన, స్థానిక శాసనసభ్యులు మరియు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్న కొందరు ప్రజా ప్రతినిధులు అవినీతికి ఆలవాలంగా మారారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు పక్కకు పోయి, వీరి అవినీతి వలన ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రతి చిన్న పనికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భూ కబ్జాలు ఎక్కువై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు, “మీకు అధికారం లేకపోయినా ఇంత సేవ చేశారు, కార్పొరేటర్ గా పోటీ చేస్తే నిస్వార్థంగా అభివృద్ధి చేస్తారని” మాపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోరిక మేరకు, రాజకీయాలకు అతీతంగా, సేవా దృక్పథంతో *మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలలో* మా వార్డు నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము. నీతికి, నిజాయితీకి, సేవా దృక్పథానికి పట్టం కట్టి, మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్ గా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. విశ్వగురువుగా భారత్ ను అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న ప్రియతమ ప్రధాని మోదీ నీతివంతమైన పాలనతో గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్న పవన్కళ్యాణ్క, యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకొని మేము పని చేస్తాము. గెలిచిన తర్వాత మా ప్రణాళిక, వాగ్దానాలను త్వరలో తెలియజేస్తాము. మేము జీవితాంతం *జీరో బడ్జెట్ పాలిటిక్స్* చేశాము. డబ్బులు ఖర్చుపెట్టి గెలిచి తర్వాత ప్రజలను పీడించే అవసరం మాకు లేదు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చుకు కావలసిన ఆర్థిక స్తోమత మా వద్ద లేదు కాబట్టి, *”ఒక నోటు – ఒక ఓటు”* ఇచ్చి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన విరాళంలో మిగిలిన ప్రతి రూపాయికి లెక్క చెబుతాము. మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోయినా, అవినీతికి పాల్పడినా *రీకాల్ చేసేందుకు అఫిడవిట్* కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. బొండా యల్లాజీ రావు – బొండా శ్రీదేవి

మేము గత 41 సంవత్సరాలుగా వడ్లపూడి RH కాలనీ, కూర్మన్నపాలెం పరిసర ప్రాంత ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు చేశాము.

ముఖ్యంగా *స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, మురికివాడల అభివృద్ధి, గణపతి కాలనీ, NTR నగర్, రాజాలమ్మ కాలనీ* సమస్యలపై, అలాగే *రాయల చెరువు పరిరక్షణ* కొరకు నిరంతరం పోరాడాము. ఈ విషయాలన్నీ మీకు విదితమే.

గ్రీన్ బెల్ట్ స్థలం కోసం జరిగిన పోరాటంలో మేము అనేక పోలీసు నిర్బంధాలను ఎదుర్కొన్నాము. ఆ సమయంలో యల్లాజీ రావు అండర్ గ్రౌండ్ లో ఉండగా, చంటి పిల్లలతో శ్రీదేవి ఎదుర్కొన్న దయనీయ పరిస్థితి మీ అందరికీ తెలుసు.

ప్రస్తుతం ప్రజా అనుకూల ప్రభుత్వం రావడం వలన, స్థానిక శాసనసభ్యులు మరియు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కానీ ఇక్కడ ఉన్న కొందరు ప్రజా ప్రతినిధులు అవినీతికి ఆలవాలంగా మారారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు పక్కకు పోయి, వీరి అవినీతి వలన ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ప్రతి చిన్న పనికి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భూ కబ్జాలు ఎక్కువై ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు, “మీకు అధికారం లేకపోయినా ఇంత సేవ చేశారు, కార్పొరేటర్ గా పోటీ చేస్తే నిస్వార్థంగా అభివృద్ధి చేస్తారని” మాపై ఒత్తిడి తెస్తున్నారు.

అందుకే అన్ని వర్గాల ప్రజల కోరిక మేరకు, రాజకీయాలకు అతీతంగా, సేవా దృక్పథంతో *మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలలో* మా వార్డు నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము.

నీతికి, నిజాయితీకి, సేవా దృక్పథానికి పట్టం కట్టి, మీలో ఒకరిగా, మీ కుటుంబ సభ్యులుగా మమ్మల్ని ఆశీర్వదించి కార్పొరేటర్ గా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము.

విశ్వగురువుగా భారత్ ను అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న ప్రియతమ ప్రధాని మోదీ నీతివంతమైన పాలనతో గ్రామ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్న పవన్కళ్యాణ్క, యోగి ఆదిత్యనాథ్ ఆదర్శంగా తీసుకొని మేము పని చేస్తాము. గెలిచిన తర్వాత మా ప్రణాళిక, వాగ్దానాలను త్వరలో తెలియజేస్తాము.

మేము జీవితాంతం *జీరో బడ్జెట్ పాలిటిక్స్* చేశాము. డబ్బులు ఖర్చుపెట్టి గెలిచి తర్వాత ప్రజలను పీడించే అవసరం మాకు లేదు. ప్రస్తుతం ఎన్నికల ఖర్చుకు కావలసిన ఆర్థిక స్తోమత మా వద్ద లేదు కాబట్టి, *”ఒక నోటు – ఒక ఓటు”* ఇచ్చి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన విరాళంలో మిగిలిన ప్రతి రూపాయికి లెక్క చెబుతాము.

మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోయినా, అవినీతికి పాల్పడినా *రీకాల్ చేసేందుకు అఫిడవిట్* కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.
బొండా యల్లాజీ రావు – బొండా శ్రీదేవి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.