ఆదివారం జరగనున్న నీట్ పీజీ–2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ అమల్లో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడరాదని సూచించారు. సభలు, ర్యాలీలు, వాహనాలు, డీజేలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు, పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.



