ఉత్తమ సేవలకు గుర్తింపు.. నాయుడుపేట అర్బన్ ఎస్సై శివశంకర్రావును సత్కరించిన తిరుపతి ఎస్పీ
నాయుడుపేట
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎం. శివశంకర్రావుకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రశంసా పురస్కారం అందజేశారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జిల్లాలో వివిధ విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన పోలీసు అధికారులను ఎస్పీ సత్కరించారు. ఈ సందర్భంగా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో విశేష కృషి చేసినందుకు నాయుడుపేట అర్బన్ ఎస్సై శివశంకర్రావును ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని ప్రోత్సహించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ గుర్తింపు మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుందని ఎస్సై శివశంకర్రావు తెలిపారు. జిల్లా స్థాయిలో అందుకున్న ఈ ప్రశంసా పురస్కారంతో నాయుడుపేట పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


