చేజర్ల మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు. అనంతరం స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయంలో ఎంపీడీవో అమర్ జెండా ఆవిష్కరించారు. చేజర్ల బస్టాండ్ సెంటర్‌లో మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ, ఎంపీడీవో సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

చేజర్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు