Sunday, 16 August 2026
  • Home  
  • ఎస్ కోట తాశీల్దార్ వారి కార్యలయం లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు —పాల్గొన్న శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
- విజయనగరం 

ఎస్ కోట తాశీల్దార్ వారి కార్యలయం లో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు —పాల్గొన్న శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి

మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఎస్.కోట తహసీల్దార్‌ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతిపిత గాంధీజీ చిత్రపటానికి ఘన నివాళి, జాతీయ పతాకావిష్కరణ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,ఆగస్టు 15 పున్నమి ప్రతినిది దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పిలుపునిచ్చారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్.సి.సి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ.. భారతీయులందరికీ ఆగస్టు 15 ఒక పవిత్రమైన పండుగ వంటిదని పేర్కొన్నారు. బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు గాంధీ మహాత్ముడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, వీరవనిత రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన సైనికులను కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, వారి స్ఫూర్తితో దేశ సార్వభౌమాధికారాన్ని, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవాలని కోరారు. కూటమి పాలనలో సంక్షేమ శకం – పేదలకు అండగా పథకాలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కొనియాడారు. 1983లో ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పేదలకు ఉచిత బియ్యం, పెన్షన్లను రూ.4,000 నుంచి రూ.15,000 వరకు పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. పేద విద్యార్థుల చదువుల కోసం ‘తల్లికి వందనం’ ద్వారా రూ.15,000, రైతులకు అండగా ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా రూ.20,000 వ్యవసాయ ఖర్చులకు అందిస్తున్నామని వివరించారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ‘స్త్రీ శక్తి’ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, ‘దీపం-2’ పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తూ పేదల ప్రభుత్వంగా నిలిచిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి.. పారిశ్రామిక, ఉద్యోగ విప్లవం ఉత్తరాంధ్ర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు పేరిట భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం కావడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని లలితకుమారి పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల విస్తరణతో పాటు మన ప్రాంతంలో సుమారు 1,200 ఎకరాల్లో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమిపూజ జరగడం శుభపరిణామమన్నారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మెగా డీఎస్సీ ద్వారా 16,800 పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల ద్వారా 6 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే పేద కుటుంబాల ఆస్తుల భద్రత కోసం రెవెన్యూ శాఖ ద్వారా ఉచిత పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు. నేటి ఆధునిక, వేగవంతమైన యుగంలో విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా నైతిక విలువలనూ అలవరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్వామి వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సత్యం, ధర్మం పునాదులుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, ప్రజలంతా ప్రభుత్వానికి తోడ్పాటు అందించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జనగణమన జాతీయ గీతాలాపనతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

ఎస్.కోట తహసీల్దార్‌ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతిపిత గాంధీజీ చిత్రపటానికి ఘన నివాళి, జాతీయ పతాకావిష్కరణ

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే

విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,ఆగస్టు 15 పున్నమి ప్రతినిది

దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎస్.కోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి పిలుపునిచ్చారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్.సి.సి విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, వందేమాతరం గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ.. భారతీయులందరికీ ఆగస్టు 15 ఒక పవిత్రమైన పండుగ వంటిదని పేర్కొన్నారు. బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు గాంధీ మహాత్ముడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజినీ నాయుడు, వీరవనిత రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలర్పించిన సైనికులను కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, వారి స్ఫూర్తితో దేశ సార్వభౌమాధికారాన్ని, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవాలని కోరారు.

కూటమి పాలనలో సంక్షేమ శకం – పేదలకు అండగా పథకాలు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కొనియాడారు. 1983లో ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పేదలకు ఉచిత బియ్యం, పెన్షన్లను రూ.4,000 నుంచి రూ.15,000 వరకు పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. పేద విద్యార్థుల చదువుల కోసం ‘తల్లికి వందనం’ ద్వారా రూ.15,000, రైతులకు అండగా ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏటా రూ.20,000 వ్యవసాయ ఖర్చులకు అందిస్తున్నామని వివరించారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ‘స్త్రీ శక్తి’ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, ‘దీపం-2’ పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తూ పేదల ప్రభుత్వంగా నిలిచిందన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి.. పారిశ్రామిక, ఉద్యోగ విప్లవం
ఉత్తరాంధ్ర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చే విధంగా అల్లూరి సీతారామరాజు పేరిట భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగవంతం కావడం ఈ ప్రాంత అభివృద్ధికి నిదర్శనమని లలితకుమారి పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల విస్తరణతో పాటు మన ప్రాంతంలో సుమారు 1,200 ఎకరాల్లో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు భూమిపూజ జరగడం శుభపరిణామమన్నారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మెగా డీఎస్సీ ద్వారా 16,800 పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు, రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల ద్వారా 6 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే పేద కుటుంబాల ఆస్తుల భద్రత కోసం రెవెన్యూ శాఖ ద్వారా ఉచిత పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు.

నేటి ఆధునిక, వేగవంతమైన యుగంలో విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా నైతిక విలువలనూ అలవరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్వామి వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సత్యం, ధర్మం పునాదులుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని, ప్రజలంతా ప్రభుత్వానికి తోడ్పాటు అందించి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జనగణమన జాతీయ గీతాలాపనతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.