విశాఖపట్నం: విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు సోదరులు శ్రీ చోడే వెంకట పట్టాభిరామ్ గారి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి బలమని, కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామిగా నిలవాలని, వికసిత్ భారత్ నిర్మాణం కోసం సమష్టిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా టీడీపీ కార్యాలయం జాతీయ జెండా రెపరెపలతో సందడిగా మారింది. దేశభక్తి నినాదాలు, కార్యకర్తలు మరియు అభిమానుల ఉత్సాహంతో కార్యక్రమం ఘనంగా సాగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖ టీడీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
విశాఖపట్నం: విశాఖపట్నం పార్లమెంట్ అధ్యక్షులు సోదరులు శ్రీ చోడే వెంకట పట్టాభిరామ్ గారి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి బలమని, కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామిగా నిలవాలని, వికసిత్ భారత్ నిర్మాణం కోసం సమష్టిగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా టీడీపీ కార్యాలయం జాతీయ జెండా రెపరెపలతో సందడిగా మారింది. దేశభక్తి నినాదాలు, కార్యకర్తలు మరియు అభిమానుల ఉత్సాహంతో కార్యక్రమం ఘనంగా సాగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

