*నాయుడుపేట మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ*
తిరుపతి జిల్లా నాయుడుపేట మండల బీజేపీ రూరల్ అధ్యక్షుడిగా నియమితులైన బాలకృష్ణయ్య తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కారుమంచివారి కండ్రిగ మరియు మందబైలు గ్రామాల్లోని పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కారుమంచివారి కండ్రిగ, మందబైలు గ్రామాల అంగన్‌వాడీ మరియు పాఠశాల విద్యార్థులకు భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అలాగే విద్యార్థుల కోసం రన్నింగ్ రేసులు, కప్పగంతులు, కుర్చీలాట తదితర క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
బీజేపీ నాయుడుపేట మండల రూరల్ అధ్యక్షుడు బాలకృష్ణయ్య చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల రూరల్ ఉపాధ్యక్షుడు తోప్పని అంకారావు, రాయిపు బాపూజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మస్తానయ్య, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య వేడుకల్లో విద్యార్థులకు ప్రోత్సాహం.. బీజేపీ రూరల్ అధ్యక్షుడు బాలకృష్ణయ్య చేతుల మీదుగా బహుమతుల పంపిణీ
*నాయుడుపేట మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ* తిరుపతి జిల్లా నాయుడుపేట మండల బీజేపీ రూరల్ అధ్యక్షుడిగా నియమితులైన బాలకృష్ణయ్య తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కారుమంచివారి కండ్రిగ మరియు మందబైలు గ్రామాల్లోని పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కారుమంచివారి కండ్రిగ, మందబైలు గ్రామాల అంగన్‌వాడీ మరియు పాఠశాల విద్యార్థులకు భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. అలాగే విద్యార్థుల కోసం రన్నింగ్ రేసులు, కప్పగంతులు, కుర్చీలాట తదితర క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. బీజేపీ నాయుడుపేట మండల రూరల్ అధ్యక్షుడు బాలకృష్ణయ్య చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల రూరల్ ఉపాధ్యక్షుడు తోప్పని అంకారావు, రాయిపు బాపూజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మస్తానయ్య, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

