*రెండేళ్ల కుమార్తెతో యువతి మాయం.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల వేడుకోలు*
*తల్లి కోసం విలవిలలాడుతున్న ఇద్దరు పిల్లలు.. టి. లక్ష్మి జాడ తెలిపాలని బంధువుల విజ్ఞప్తి*
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలానికి చెందిన టి. లక్ష్మి (26) అనే యువతి తన రెండేళ్ల కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మి, ” తల్లికి వందనం” పథకం డబ్బులు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు బంధువులు వెల్లడించారు. అనంతరం ఆ డబ్బులను డ్రా చేసి ఎక్కడికి వెళ్లిందో తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
లక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉండగా, వారిలో ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం తల్లి కోసం విలవిలలాడుతున్నారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు నాయుడుపేట ఎస్టీ కాలనీలో ఉన్నట్లు సమాచారం.
లక్ష్మి ఆచూకీ తెలిసిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరికైనా సమాచారం ఉంటే 9912490051 లేదా 728606078 నంబర్లకు సంప్రదించాలని కోరారు.


