హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించిన తాజా సూచనల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు ఎండల తీవ్రత పెరిగే పరిస్థితి కనిపించడం లేదు. సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


