ఖానాపూరం హవేలి /ఖమ్మం
మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఖానాపురం హవెలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ సూచించారు. పాండురంగపురం, బల్లేపల్లి గ్రామాల్లోని పలు పాఠశాలల్లో ఖానాపురం హవెలి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంతో పాటు సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన, మాదక ద్రవ్యాల రహిత వాతావరణాన్ని కల్పించడంతో పాటు సమాజంలో డ్రగ్స్‌పై అప్రమత్తత పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో పాఠశాల పరిసరాలు, సమీపంలోని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల ఆనవాళ్ల కోసం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.



