Saturday, 29 August 2026
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

*శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల NAAC A ++ (కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అటానమస్ కళాశాల, మచిలీపట్నం) 31.08.2026 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి మేడం అధ్యక్షతన “కవయిత్రీ విజయం” అనే రూపక సాహితీ సదస్సు నిర్వహించబడినది. “కవయిత్రీ విజయం” అనే రూపకాన్ని రచించినది, నిర్వహించినది …..జాతీయ స్థాయి ఉత్తమ రచయిత్రీ అవార్డు గ్రహీత… శ్రీమతి మందరపు హైమవతి గారు. ఈ రూపకంలోని పాత్రలన్నీ భావోద్వేగాలతో, ఆదర్శ భావాలతో, సమస్యా పరిష్కారాలతో పోషింపబడ్డాయి. మొత్తంగా శ్రీవాద కవయిత్రులను పరిచయం చేశారు. ప్రతీ పాత్రనూ ఎంతో రసవంతంగా జీవింపజేయడం జరిగింది. *ఈ రూపకంలోని పాత్రలు – పాత్రధారులు :* 1. చావలి బంగారమ్మ -శ్రీమతి ఆలపాటిసత్యవతి 2. వాణి రంగారావు- శ్రీమతి.పాటిబండ్ల కవిత 3. పుట్ల హేమలత – డా. ఓలేటి ఉమాసరస్వతి 4. కొండపల్లి కోటీశ్వరమ్మ -శ్రీమతి కర్రి రాధాకృష్ణ 5. సావిత్రి -శ్రీమతి పంచాగ్నుల కృష్ణవేణి 6. శివలంక రాజేశ్వరీ దేవి – చింతలూరి ఉమాదేవి 7. రేవతి దేవి – యామినీ కృష్ణ బండ్లమూడి…. వీరు ఈ రూపకం ద్వారా స్త్రీవాద రచయిత్రుల రచనల్లో స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం,హక్కులు ప్రధానంగా కనిపింపజేశారు. “స్త్రీ కేవలం కుటుంబానికే పరిమితమైన వ్యక్తిగా కాకుండా, తన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశయాలు కలిగిన వ్యక్తిగా గుర్తించాలి అని కోరారు. స్త్రీకి పురుషుడితో సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలి, స్త్రీ తన జీవితంపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని,స్త్రీపై జరిగే వివక్ష,అణచివేత,హింస తొలగాలని,విద్యా ఉద్యోగం సామాజిక రంగాల్లో స్త్రీకి సమాన అవకాశాలు ఉండాలని,స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ స్వతంత్రంగా ఎదగాలని, స్త్రీ బలహీనురాలు కాదని ….ఆమెకు స్వేచ్ఛ సమానత్వం పురుషులతో సమాన గౌరవం అవసరం….అనే సందేశాన్ని ఈ రూపకం ద్వారా విద్యార్థులకు తెలియజేశారు. ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి మేడం, తెలుగు విభాగాధిపతి డా. కె. సరళ, తెలుగు విభాగాధ్యాపకులు డాక్టర్ ఐ. మంజుల, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

*శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల
NAAC A ++
(కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అటానమస్ కళాశాల, మచిలీపట్నం)

31.08.2026 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి మేడం అధ్యక్షతన “కవయిత్రీ విజయం” అనే రూపక సాహితీ సదస్సు నిర్వహించబడినది.

“కవయిత్రీ విజయం” అనే రూపకాన్ని రచించినది, నిర్వహించినది …..జాతీయ స్థాయి ఉత్తమ రచయిత్రీ అవార్డు గ్రహీత… శ్రీమతి మందరపు హైమవతి గారు.

ఈ రూపకంలోని పాత్రలన్నీ భావోద్వేగాలతో, ఆదర్శ భావాలతో, సమస్యా పరిష్కారాలతో పోషింపబడ్డాయి. మొత్తంగా శ్రీవాద కవయిత్రులను పరిచయం చేశారు. ప్రతీ పాత్రనూ ఎంతో రసవంతంగా జీవింపజేయడం జరిగింది.

*ఈ రూపకంలోని పాత్రలు – పాత్రధారులు :*
1. చావలి బంగారమ్మ -శ్రీమతి ఆలపాటిసత్యవతి
2. వాణి రంగారావు- శ్రీమతి.పాటిబండ్ల కవిత
3. పుట్ల హేమలత – డా. ఓలేటి ఉమాసరస్వతి
4. కొండపల్లి కోటీశ్వరమ్మ -శ్రీమతి కర్రి రాధాకృష్ణ
5. సావిత్రి -శ్రీమతి పంచాగ్నుల కృష్ణవేణి
6. శివలంక రాజేశ్వరీ దేవి – చింతలూరి ఉమాదేవి
7. రేవతి దేవి – యామినీ కృష్ణ బండ్లమూడి….

వీరు ఈ రూపకం ద్వారా స్త్రీవాద రచయిత్రుల రచనల్లో స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం,హక్కులు ప్రధానంగా కనిపింపజేశారు. “స్త్రీ కేవలం కుటుంబానికే పరిమితమైన వ్యక్తిగా కాకుండా, తన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశయాలు కలిగిన వ్యక్తిగా గుర్తించాలి అని కోరారు. స్త్రీకి పురుషుడితో సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలి, స్త్రీ తన జీవితంపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని,స్త్రీపై జరిగే వివక్ష,అణచివేత,హింస తొలగాలని,విద్యా ఉద్యోగం సామాజిక రంగాల్లో స్త్రీకి సమాన అవకాశాలు ఉండాలని,స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ స్వతంత్రంగా ఎదగాలని, స్త్రీ బలహీనురాలు కాదని ….ఆమెకు స్వేచ్ఛ సమానత్వం పురుషులతో సమాన గౌరవం అవసరం….అనే సందేశాన్ని ఈ రూపకం ద్వారా విద్యార్థులకు తెలియజేశారు.
ఆద్యంతం

అత్యంత ఆసక్తికరంగా జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి మేడం, తెలుగు విభాగాధిపతి డా. కె. సరళ, తెలుగు విభాగాధ్యాపకులు
డాక్టర్ ఐ. మంజుల, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.