ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల నిర్వహణకు రైల్వేకోడూరులో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో శనివారం ఆహ్వాన కమిటీ సభ్యులు స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మండలంలోని ఎన్డీఏ నాయకులను వేడుకలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు.
కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి, మాజీ సర్పంచ్ కారుమంచి సంయుక్త, తాతంశెట్టి తులసి తదితరులు పాల్గొన్నారు. అలాగే మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుపాకుల పెంచలయ్య, పురం సురేష్, షేక్ రియాజ్, ఆనందలతేజ, మలిశెట్టి రమేష్, రాగిపాటి విజయ్, సువారపు హరిప్రసాద్, మహంకాళి నాగేంద్ర, పొన్నారెడ్డి, తుపాకుల శంకర, తుపాకుల రవి చరణ్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోడూరు : పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల నిర్వహణకు రైల్వేకోడూరులో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో శనివారం ఆహ్వాన కమిటీ సభ్యులు స్థానిక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మండలంలోని ఎన్డీఏ నాయకులను వేడుకలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి, మాజీ సర్పంచ్ కారుమంచి సంయుక్త, తాతంశెట్టి తులసి తదితరులు పాల్గొన్నారు. అలాగే మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తుపాకుల పెంచలయ్య, పురం సురేష్, షేక్ రియాజ్, ఆనందలతేజ, మలిశెట్టి రమేష్, రాగిపాటి విజయ్, సువారపు హరిప్రసాద్, మహంకాళి నాగేంద్ర, పొన్నారెడ్డి, తుపాకుల శంకర, తుపాకుల రవి చరణ్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

