ఖమ్మం:
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.15 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన, బీజేవైఎం అధ్యక్షుడు శాసనల సాయిరాం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సన్నే ఉదయ్ ప్రతాప్, పాలేరు అసెంబ్లీ ఇన్‌చార్జి నున్నా రవికుమార్, భూక్యా శ్యాంసుందర్ నాయక్, గుత్త వెంకటేశ్వర్లు, మంద సరస్వతి, శ్రీరామనేని మణి, రవి రాథోడ్, రవి గౌడ్, మృత్యుంజయ రావు, వాకా ధాని రామకృష్ణ, గుత్త వంశీ, జ్వాలా నర్సింహారావు, ఖమ్మం టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ పాల్గొన్నారు. బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



