పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు మండలం: నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ రక్షా బంధన్ పండుగ సందర్భంగా నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్, BJHPS రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
రక్షా బంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం, ప్రేమ మరింత బలపడాలని ఆకాంక్షించారు.
నాగులపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని దూపం అంజనేయులు ఆకాంక్షించారు.




