Thursday, 3 September 2026
  • Home  
  • *సూళ్లూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్-చార్జి డి.కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో…*
- తిరుపతి

*సూళ్లూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్-చార్జి డి.కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో…*

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త డి.కిరణ్ కుమార్ గారు, జిల్లా నేతలు మరియు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొని వైఎస్ఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా బంధువుగా ప్రజల మనసులు గెలిచిన గొప్ప నాయకుడని, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు వైఎస్ఆర్ ని కొనియాడారు. సూళ్లూరుపేట సమన్వయకర్త “డి. కిరణ్ కుమార్”గారు మాట్లాడుతూ, జలయజ్ఞం పేరుతో రైతుల అభివృద్ధికి పాటుపడి రైతుల ఆపద్భాంధవుడిగా, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేద ప్రజలకు సంజీవనిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీని గెలిపించిన మహనేత వైఎస్ఆర్ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తపాల దామోదర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త నరసింహులు, అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ రత్నం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మధుకర్ బాబు, సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్వేత, దొరవారిసత్రం మండల మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తిరుపతి జిల్లా కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త డి.కిరణ్ కుమార్ గారు, జిల్లా నేతలు మరియు వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొని వైఎస్ఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా బంధువుగా ప్రజల మనసులు గెలిచిన గొప్ప నాయకుడని, దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు వైఎస్ఆర్ ని కొనియాడారు.

సూళ్లూరుపేట సమన్వయకర్త “డి. కిరణ్ కుమార్”గారు మాట్లాడుతూ, జలయజ్ఞం పేరుతో రైతుల అభివృద్ధికి పాటుపడి రైతుల ఆపద్భాంధవుడిగా, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేద ప్రజలకు సంజీవనిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పార్టీని గెలిపించిన మహనేత వైఎస్ఆర్ ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తపాల దామోదర్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త నరసింహులు, అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ రత్నం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మధుకర్ బాబు, సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్వేత, దొరవారిసత్రం మండల మహిళా అధ్యక్షురాలు చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.