Thursday, 3 September 2026
  • Home  
  • కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు
- ఖమ్మం

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం – కాంగ్రెస్ నాయకులు ఏన్కూరు: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఏన్కూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు స్వర్ణ నరేందర్ మరియు మార్కెట్ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పనిచేస్తూ పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. 1000 రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ నాయకులు ప్రభుత్వ పనితీరును వివరించారు. పేద కుటుంబాలకు అండగా నిలిచి, ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి పేదవాడి కలను నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నాయకులు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యం – కాంగ్రెస్ నాయకులు

ఏన్కూరు:

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఏన్కూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు స్వర్ణ నరేందర్ మరియు మార్కెట్ చైర్మన్ గుగులోత్
లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పనిచేస్తూ పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.

1000 రోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ నాయకులు ప్రభుత్వ పనితీరును వివరించారు.

పేద కుటుంబాలకు అండగా నిలిచి, ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ప్రతి పేదవాడి కలను నెరవేర్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నాయకులు పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.