Wednesday, 20 May 2026
  • Home  
  • భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలీ- సీపీఐఎం నేత గంధం మణి
- తిరుపతి

భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలీ- సీపీఐఎం నేత గంధం మణి

శ్రీకాళహస్తి: భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ ఒక వెలుగుచుక్క అని, ఆయన త్యాగం అజరామరమని సీపీఐ(ఎం) ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి కొనియాడారు. సోమవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ ల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గంధం మణి మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని, కమ్యూనిస్టు భావజాలంతో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. నేటి యువత మత్తు పదార్థాలకు, మతోన్మాదానికి దూరంగా ఉండి, సమసమాజ స్థాపన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్యతో పాటు గురునాథం, రాపూరు సుబ్రమణ్యం, ఉస్మాన్ బాషా, కే.సుబ్రమణ్యం మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి: భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో భగత్ సింగ్ ఒక వెలుగుచుక్క అని, ఆయన త్యాగం అజరామరమని సీపీఐ(ఎం) ప్రాంతీయ కార్యదర్శి గంధం మణి కొనియాడారు. సోమవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ ల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గంధం మణి మాట్లాడుతూ.. బ్రిటీష్ పాలకుల గుండెల్లో నిద్రపోయిన విప్లవ వీరుడు భగత్ సింగ్ అని, కమ్యూనిస్టు భావజాలంతో చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. నేటి యువత మత్తు పదార్థాలకు, మతోన్మాదానికి దూరంగా ఉండి, సమసమాజ స్థాపన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పెనగడం గురవయ్యతో పాటు గురునాథం, రాపూరు సుబ్రమణ్యం, ఉస్మాన్ బాషా, కే.సుబ్రమణ్యం మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.