మర్రిపాడు: మండలంలోని కండ్రిక సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇథియోస్ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు సమాచారం. నిద్రమత్తు కారణంగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిద్రమత్తులో వాహనాలు నడపవద్దని పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.

నిద్రమత్తులో డివైడర్ను ఢీకొన్న కారు.. ఒకరు మృతి