Friday, 4 September 2026
  • Home  
  • కొత్తపట్నం ZPHSలో హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన
- ప్రకాశం

కొత్తపట్నం ZPHSలో హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన

కొత్తపట్నం: కొత్తపట్నం ZPHS ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు హెచ్‌ఐవీ–ఎయిడ్స్, సుఖవ్యాధులు, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ చర్యలపై విద్యార్థులకు వివరించారు. హెచ్‌ఐవీ ప్రధానంగా కలుషితమైన సూదులు, సిరంజీల వినియోగం, కలుషిత రక్తం మార్పిడి, హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లి నుంచి బిడ్డకు, సురక్షితం కాని లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే సుఖవ్యాధులు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ORW ఎం. వెంకటరావు, కె. మంగా, ఆర్. భవాని, ఏ. సింగం, ఆర్. అస్మత్ బేగం, ఎన్. రహెల్లెమ్మ, హెచ్‌ఎం బి. శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, హెచ్‌ఐవీపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.

కొత్తపట్నం: కొత్తపట్నం ZPHS ఉన్నత పాఠశాలలో బాలబాలికలకు హెచ్‌ఐవీ–ఎయిడ్స్, సుఖవ్యాధులు, డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ చర్యలపై విద్యార్థులకు వివరించారు.
హెచ్‌ఐవీ ప్రధానంగా కలుషితమైన సూదులు, సిరంజీల వినియోగం, కలుషిత రక్తం మార్పిడి, హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లి నుంచి బిడ్డకు, సురక్షితం కాని లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. అలాగే సుఖవ్యాధులు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో ORW ఎం. వెంకటరావు, కె. మంగా, ఆర్. భవాని, ఏ. సింగం, ఆర్. అస్మత్ బేగం, ఎన్. రహెల్లెమ్మ, హెచ్‌ఎం బి. శ్రీనివాసులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, హెచ్‌ఐవీపై ఉన్న అపోహలను తొలగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.