తిరుపతి ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)
తిరుపతిలోని గొల్లవాని గుంట క్రికెట్ స్టేడియం, దామినేడుతో పాటు ఇతర శాప్ క్రీడా మౌలిక సదుపాయాలను హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ చైర్మన్ అనురాగ్ చౌదరి , శాప్ చైర్మన్ రవి నాయుడు తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న క్రీడాభివృద్ధి కార్యక్రమాలను రవి నాయుడు , అనురాగ్ చౌదరి కి వివరించారు. తిరుపతిలోని డామినేడు వద్ద ఉన్న క్రీడా ప్రాంగణాన్ని పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా అభివృద్ధి చేయడంతో పాటు, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి, ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజీలో హాకీ టర్ఫ్ నిర్మాణం కోసం సీస్సార్ నిధులు మంజూరు చేయాలని రవి నాయుడు కోరారు.
ఈ ప్రతిపాదనలపై అనురాగ్ చౌదరి సానుకూలంగా స్పందించి, సహకారంపై ఆశాజనక సంకేతాలు ఇచ్చారు.

