చిట్వేల్ మండలంలోని పాత చిట్వేల్ గ్రామంలో కొలువైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ రాజగోపుర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించారు. రాజగోపుర నిర్మాణం పూర్తయితే ఆలయానికి మరింత శోభ చేకూరడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని గ్రామస్థులు, భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










