Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: నాగర్ కర్నూల్ జిల్లా

రంగారెడ్డి

గాంధీ జయంతి సందర్భంగా నాగులపల్లిలో ఘన నివాళులు

నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని నాగులపల్లి గ్రామంలో గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ మల్లేపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరిత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించారని, సత్యం, అహింస సిద్ధాంతాలతో దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, పరిశుభ్రత మార్గాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో పాటించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నరసింహ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం నాగులపల్లిలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నాగులపల్లి గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ నాయకులు మల్లేపల్లి జగన్మోహన్ రెడ్డి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా శక్తికి, ఆత్మగౌరవ పోరాటానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల పెద్దలు మొగిలి బాలస్వామి, మండ్ల చంద్రయ్య, మొగిలి నారాయణ, రామకృష్ణ, శ్రీను పాల్గొన్నారు. అలాగే ఆంజనేయులు, సుదర్శన్, సత్యనారాయణ, మాషన్న తదితరులు హాజరై నివాళులు అర్పించారు. కోడేరు మండల అధ్యక్షులు దాసరాజుల రవి కూడా కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు. స్థానిక నాయకులు, సంఘాల ప్రతినిధులు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. వీరవనిత ఐలమ్మ త్యాగాలు, పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

రంగారెడ్డి

భక్తిశ్రద్ధలతో బాల గణపతి పూజలు.. నాగులపల్లిలో ఘనంగా నిర్వహించిన వివేకానంద యూత్

నాగర్ కర్నూలు జిల్లా: కోడేరు మండలం, నాగులపల్లి, బేడ బుడగ జంగం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో నాగులపల్లి గ్రామంలో బాల గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, గణపతిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మల్లెపల్లి సరితా జగన్ మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ గోపాల చారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరితా జగన్ మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ గోపాలచారిలను వివేకానంద యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిరిగిరి కృష్ణ, దూపం శ్రీనివాసులు, దూపం వెంకటస్వామి, సిరిగిరి ముత్యాలు, దుదుకూరి మంత్రాలి, దూపం సాయిలు, దుదుకూరి నరేష్, సిరిగిరి వేణు, దుదుకూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు, యువకుల సహకారంతో బాల గణపతి పూజా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

రంగారెడ్డి

వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పల్లా భాస్కర్ రెడ్డిని సన్మానించిన చత్రపతి శివాజీ యూత్

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం, నాగులపల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నాగులపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక విగ్రహదాతగా, అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన పల్లా భాస్కర్ రెడ్డి గారికి వినాయక బృందం సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అందించిన సహకారాన్ని అభినందిస్తూ పుష్పగుచ్ఛం అందజేసి చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ, పండుగల నిర్వహణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని తెలిపారు. భక్తి, సేవా కార్యక్రమాలతో వినాయక చవితిని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, వినాయక బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. 🙏🏻💐

రంగారెడ్డి

గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు గౌరవ భృతి కల్పించాలి.. గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వార్డు సభ్యులకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించాలి.. నాగులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు

పున్నమి: నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నెలవారీ కనీస వేతనం లేదా గౌరవ భృతి మంజూరు చేయాలని నాగులపల్లి గ్రామ పంచాయతీ 3వ వార్డు సభ్యులు, ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు గ్రహీత దూపం అంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో క్షేత్రస్థాయిలో అత్యంత కీలకమైనదని తెలిపారు. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నికైన వార్డు సభ్యులు తమ వార్డుల అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. వార్డు సభ్యులు ఎటువంటి నెలవారీ వేతనం లేదా గౌరవ భృతి లేకుండానే ప్రజాసేవలో కొనసాగుతున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం తమ సమయాన్ని, శ్రమను వెచ్చిస్తున్నారని తెలిపారు. దీంతో వార్డు సభ్యులు మరియు వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్‌లకు ప్రభుత్వం వేతనాలు, గౌరవ భృతులు అందిస్తున్నట్లుగానే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు కూడా నెలవారీ కనీస వేతనం లేదా గౌరవ భృతి అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే వార్డు సభ్యుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన ఆర్థిక భరోసా కల్పిస్తే మరింత ఉత్సాహంతో ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని దూపం అంజనేయులు అన్నారు. కావున, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు నెలవారీ కనీస వేతనం లేదా గౌరవ భృతి మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. “గ్రామాభివృద్ధే లక్ష్యం – ప్రజాసేవే ధ్యేయం” అనే నినాదంతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల సేవలను ప్రభుత్వం గుర్తించి, వారికి న్యాయం చేయాలని దూపం అంజనేయులు విజ్ఞప్తి చేశారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.. అన్నయ్యకు రాఖీ కట్టిన చెల్లెమ్మలు

పున్నమి: నాగర్‌కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు కుటుంబంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా దూపం అంజనేయులు కుమార్తెలు దూపం పావని, దూపం లక్ష్మీ ప్రియ, దూపం దేవి ప్రియ తమ అన్నయ్య దూపం ఖండేశ్వర్కు రాఖీలు కట్టి, అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఆప్యాయత, ప్రేమను చాటుకున్నారు. అనంతరం అన్నయ్యకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అన్నయ్య ఖండేశ్వర్ తన చెల్లెమ్మలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సుఖసంతోషాలను కోరుకుంటూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అన్నాచెల్లెళ్ల అనుబంధం, కుటుంబ ఐక్యతను ప్రతిబింబించేలా జరిగిన ఈ రక్షాబంధన్ వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో ముగిశాయి.

రంగారెడ్డి

నాగులపల్లి గ్రామ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు మండలం: నాగులపల్లి గ్రామ ప్రజలందరికీ రక్షా బంధన్ పండుగ సందర్భంగా నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్, BJHPS రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షా బంధన్ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం, పరస్పర గౌరవం, ప్రేమ మరింత బలపడాలని ఆకాంక్షించారు. నాగులపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని దూపం అంజనేయులు ఆకాంక్షించారు.

రంగారెడ్డి

నాగులపల్లి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో మంగళవారం రోజు బోనాల పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ సందడి నెలకొంది. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు. గ్రామంలో పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో పండుగను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి కృపతో నాగులపల్లి గ్రామం సుఖసంతోషాలతో, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.