ప్రచారంలో దూసుకుపోతున్న కంటకాపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని నాగిశెట్టి గంగమ్మ గారు
విజయనగరం జిల్లా బ్యూరో / రమణ | అక్టోబర్ 30 | ప్రజా ప్రతిభ
కంటకాపల్లి గ్రామపంచాయతీలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిని నాగిశెట్టి గంగమ్మ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శుక్రవారం టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్‌పై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా నాగిశెట్టి గంగమ్మ మాట్లాడుతూ గ్రామాలు, మండలాలు అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన, సుస్థిరమైన పరిపాలన అవసరమని, అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. తనను ఎంపీటీసీగా గెలిపిస్తే కంటకాపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అభ్యర్థి నాగిశెట్టి రమణ, తూరుబిల్లి ఆనంద్, జనసేన నాయకులు తూరుబిల్లి విజయ్ కుమార్, మదిన గురునాయుడు, తూరుబిల్లి రాము, మదిన రమణ, మాజీ ఎంపీటీసీ మిడతన కాశి, బాది రెడ్డి వెంకటరమణమూర్తి, బోధల వెంకట్, సుంకరపాలెం టీడీపీ నాయకుడు పెదిరెడ్ల సూర్యనారాయణతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఐదు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
