వార్త ముఖ్యాంశాలు
- పురపాలక ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్ల ఆన్లైన్ శిక్షణ* *విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేసిన జనరల్ అబ్జర్వర్ తేజ్ భరత్* *ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శన* విజయనగరం, జిల్లా బ్యూరో/రమణ,అక్టోబర్ 28.
- పున్నమి ప్రతినిధి పురపాలక ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.
- ఇందులో భాగంగా మైక్రో అబ్జర్వర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పురపాలక ఎన్నికలకు మైక్రో అబ్జర్వర్ల ఆన్లైన్ శిక్షణ*
*విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేసిన జనరల్ అబ్జర్వర్ తేజ్ భరత్*
*ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శన*
విజయనగరం, జిల్లా బ్యూరో/రమణ,అక్టోబర్ 28. పున్నమి ప్రతినిధి
పురపాలక ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా మైక్రో అబ్జర్వర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్ ఎన్. తేజ్ భరత్ పర్యవేక్షణలో బుధవారం ఈ శిక్షణ సాగింది.
ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా సున్నితమైన, అతి సున్నితమైన పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది నియామకం, అక్కడ నిర్వర్తించాల్సిన విధులపై స్పష్టమైన అవగాహన కల్పించారు. పోలింగ్ ప్రారంభం నుండి ప్రక్రియ ముగిసే వరకు పోలింగ్ కేంద్రం లోపల, వెలుపల జరిగే ప్రతి పరిణామాన్ని నిరంతరం గమనిస్తూ, రికార్డు చేయాలని ఆదేశించారు.
శిక్షణ సమయంలో మైక్రో అబ్జర్వర్లు లేవనెత్తిన పలు సందేహాలను జనరల్ అబ్జర్వర్ నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఎన్నికల సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, సహాయక ఎన్నికల అధికారి మరియు మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
*ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శన*
మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను అబ్జర్వర్ తేజ్ భరత్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు చేసే విధానాన్ని, అక్కడి సదుపాయాలను ఆయన పరిశీలించారు.. మున్సిపల్ కమిషనర్ బాలస్వామికి పలు సూచనలు చేశారు.
.