ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతినిధి)
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా దూషిస్తూ, అసభ్యకరమైన సందేశాలు పంపిన వ్యక్తిపై ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లందుకు చెందిన మద్యం వ్యాపారి కొండపల్లి గణేష్ తన సెల్‌ఫోన్ నంబర్ నుంచి తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు సోమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సందేశాలు పంపుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వాట్సాప్ మెసేజ్‌లు, సోషల్ మీడియా ఆధారాలను పోలీసులకు సమర్పించినట్లు చెప్పారు. కొండపల్లి గణేష్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వెల్లడించారు.


