నిర్మల్ జిల్లా పున్నమి ప్రతినిధి
నిర్మల్ : రూ.23.75 కోట్లతో నిర్మాణం పూర్తి.. ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోని వైనం
నిర్మల్: నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో 2023–24 సంవత్సరంలో రూ.23.75 కోట్ల వ్యయంతో మంజూరైన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (ట్రామా సెంటర్) నిర్మాణ పనులు పూర్తై దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం విచారకరమని ఏ.ఐ.కే.ఆర్ క్యాంప్ కార్యాలయం పేర్కొంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జిల్లా ఆసుపత్రిని సందర్శించి ట్రామా సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు.
పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందాలంటే ట్రామా సెంటర్ను తక్షణమే ప్రారంభించాలని వారు కోరారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుని ట్రామా సెంటర్ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
– ఏ.ఐ.కే.ఆర్ క్యాంప్ కార్యాలయం, నిర్మల్

నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో ట్రామా సెంటర్ను వెంటనే ప్రారంభించాలి
నిర్మల్ జిల్లా పున్నమి ప్రతినిధి నిర్మల్ : రూ.23.75 కోట్లతో నిర్మాణం పూర్తి.. ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోని వైనం నిర్మల్: నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో 2023–24 సంవత్సరంలో రూ.23.75 కోట్ల వ్యయంతో మంజూరైన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (ట్రామా సెంటర్) నిర్మాణ పనులు పూర్తై దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం విచారకరమని ఏ.ఐ.కే.ఆర్ క్యాంప్ కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జిల్లా ఆసుపత్రిని సందర్శించి ట్రామా సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందాలంటే ట్రామా సెంటర్ను తక్షణమే ప్రారంభించాలని వారు కోరారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుని ట్రామా సెంటర్ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. – ఏ.ఐ.కే.ఆర్ క్యాంప్ కార్యాలయం, నిర్మల్

