Saturday, 5 September 2026
  • Home  
  • పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి
- అన్నమయ్య

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి

నందలూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్‌లో భారీగా బాణసంచా పేల్చి, పటాకులు కాల్చడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కొట్టే శ్రీహరి మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని భగవంతుడు ఆయనకు ప్రసాదించాలని కోరుతూ పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు రెడ్డయ్య, హైస్కూల్ చైర్మన్ ఉపేంద్ర, పుత్త నాగేశ్వరరావు, షఫీవుల్లా, ఏపీఎన్‌ఆర్‌టీ కువైట్ కోఆర్డినేటర్ చిరంజీవి, కార్తీక్, రత్నం, ప్రతాప్, కొట్టే హరి, డాలా, సందీప్, కాటయ్య, యుగంధర్, సూరి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. జనసైనికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.