Saturday, 22 August 2026
  • Home  
  • యలమంచిలిలో సద్భావన దివస్‌ సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు…!
- అనకాపల్లి

యలమంచిలిలో సద్భావన దివస్‌ సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు…!

యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ యలమంచిలిలో సద్భావన దివస్‌ను పురస్కరించుకుని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతికి మూలమని, కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా మత సామరస్యం, జాతీయ సమగ్రతను పెంపొందించుకోవాలని సూచించారు. హింసకు తావులేకుండా పరస్పరం గౌరవించుకుంటూ శాంతియుతంగా జీవించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తలెత్తే పగలు, ప్రతీకారాలు, చిన్నచిన్న విభేదాలను న్యాయస్థానాల వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని విభేదరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యలమంచిలి | పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్

యలమంచిలిలో సద్భావన దివస్‌ను పురస్కరించుకుని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. రమేష్ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతికి మూలమని, కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా మత సామరస్యం, జాతీయ సమగ్రతను పెంపొందించుకోవాలని సూచించారు. హింసకు తావులేకుండా పరస్పరం గౌరవించుకుంటూ శాంతియుతంగా జీవించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తలెత్తే పగలు, ప్రతీకారాలు, చిన్నచిన్న విభేదాలను న్యాయస్థానాల వెలుపల సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని విభేదరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.