తిరుపతి ఆగస్టు 13 పున్నమి ప్రతినిధి
భారత తపాలా శాఖ ద్వారా అంతర్జాతీయ పార్సెల్ , అంతర్జాతీయ స్వీట్ పోస్టులు రాష్ట్రంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో శాఖా, తపాలా కార్యాలయాలు సేవలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయని తిరుపతి తపాలా విభాగం సీనియర్ సూపర్డెంట్ పోస్ట్ ఆఫీస్ అధికారి మేజర్ సైదా తన్వీర్ తెలిపారు ఈ సేవల ద్వారా విదేశాల్లో నివసిస్తున్న సోదరులకు, సోదరీమణులకు, స్నేహితులకు , బంధువులకు శుభాకాంక్షలు, కార్డులు, అనుమతించ పడ్డ వస్తువులు, వస్త్రాలు, సురక్షితంగా వేగవంతంగా ఈ సేవల ద్వారా ఉపయోగించుకోవచ్చని అన్నారు ఈ ఏడాది రాఖి పౌర్ణమి ఈ నెలలో 28 వ తేదీన జరిగే ప్రజలు రాఖీలు, అదేవిధంగా బహుమతులను ముందస్తుగా బుక్ చేసుకోవాలని తపాల శాఖ సూచిస్తుందన్నారు సమయానికి బుకింగ్ చేసుకోవడం ద్వారా విదేశాలకు పంపే రాఖీ పార్సిల్ పండుగకు ముందే చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు ప్రత్యేకంగా రాఖీ కవర్లు, రాఖీ పోస్టల్ కవర్లను పంపించే వినియోగదారులకు పోస్టల్ చార్జీలపై 10 శాతం రాయితీ ఉంటుందన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు విదేశాలకు పంపే ప్యాకింగ్ విధానం, అనుమతించబడిన వస్తువులు చార్జీలు మరియు గమ్య ధ్యాస వివరాలు కోసం మీకు అందుబాటులో ఉన్న పోస్టల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు భారత తపాల శాఖ విశ్వనీయమైన అంతర్జాతీయ తపాలా సేవలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుటుంబాలను అనుసంధానించే సేవలు తపాల శాఖ ముందు ఉంటుందని తెలిపారు


