తిరుపతి ఆగస్టు 13 సద్భావన ప్రజా బాధ్యత
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ గా నియమితులైన శ్రీధర్ వర్మను బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుపతి నగరంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.



