Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

ఓట్ల చోరీ ఆరోపణలపై సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన.

నిర్మల్: ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని నిరసిస్తూ, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేయనున్నట్లు తెలిపారు. – వెడ్మ బొజ్జు పటేల్ ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు

నిర్మల్

IMA నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రమేష్‌కు ఘన సన్మానం

నిర్మల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ రమేష్‌ను TNGOS యూనియన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా TNGOS నాయకులు డాక్టర్ రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైద్య రంగంలో ఆయన మరింత సేవలందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో TNGOS జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శులు కే. రవికుమార్, శ్రీనివాస్, సురేందర్‌తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నిర్మల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు వీరనారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: m. పోశెట్టి నిర్మల్, సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ ముందర విగ్రహానికి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రజక సంఘం నాయకుడు పోశెట్టి తో పాటు నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె త్యాగం, పోరాట స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. రజక వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, రజక సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

నిర్మల్

భైంసాలో ఘనంగా ‘సేవా సంకల్ప అభియాన్’ 14 మంది యువకుల స్వచ్ఛంద రక్తదానం

భైంసా:నిర్మల్ జిల్లా ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని భైంసాలో బీజేవైఎం (BJYM) ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా 14 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి, ఆపదలో ఉన్న ప్రాణాలకు అండగా నిలిచారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, రక్తదానం ద్వారా ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్, బీజేవైఎం నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింధె గంగా ప్రసాద్, ఉపాధ్యక్షులు ఆకుల రంజిత్, అప్పల రాకేష్, కార్యదర్శి స్వరాజ్, కార్యవర్గ సభ్యులు భీమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నేరెళ్ల ప్రమోద్ కుమార్‌కు ఘన సన్మానం

నిర్మల్: తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన నేరెళ్ల ప్రమోద్ కుమార్‌ను TNGO నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో TNGO నిర్మల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, రవికుమార్, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొని ప్రమోద్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

నిర్మల్

మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తికి జన్మదిన శుభాకాంక్షలు

నిర్మల్: మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ నాందేడ్ చిన్ను, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్ నేరెళ్ల ప్రమోద్ కుమార్ ఆయనను కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గణేష్ చక్రవర్తికి అభినందనలు తెలియజేశారు.

నిర్మల్

వానల్‌పాడ్‌లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

బైంసా :వానల్‌పాడ్, సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి): వానల్‌పాడ్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాన్ని, ధైర్యసాహసాలను, సమాజం కోసం చేసిన కృషిని ఈ సందర్భంగా నాయకులు, రజక సంఘం ప్రతినిధులు స్మరించుకున్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సమాజంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు. ఆమె ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, సామాజిక సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జయంతి సందర్భంగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి వినోద్, ఉప సర్పంచ్ సాయారెడ్డి, నాయకులు రాజు, రామ్‌రెడ్డి, సాయారెడ్డి, విద్యాసాగర్**తో పాటు రజక సంఘం నాయకులు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్

గంగమ్మ ఒడిలోకి కుబీర్ గణనాథులు. భారీ శోభాయాత్ర.. పోలీస్ బందోబస్తు మధ్య ఘనంగా నిమజ్జనం

కుబీర్:కుబీర్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల శుక్రవారం ముగింపు సందర్భంగా శనివారం గణనాథుల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగిస్తూ భారీ శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కుబీర్ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, పోలీస్ పర్యవేక్షణలో శోభాయాత్ర ప్రశాంతంగా సాగి, గణనాథులను గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేశారు.

నిర్మల్

లక్ష్మణ్‌చందా: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు లక్షాధికారి–2’

’లక్ష్మణ్‌చందా: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు లక్షాధికారి–2’ కార్యక్రమానికి సంబంధించిన పరీక్ష పత్రాలను లక్ష్మణ్‌చందా మండల విద్యాశాఖ అధికారి రాజు నాయక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇలాంటి పోటీ పరీక్షలను సద్వినియోగం చేసుకుని ప్రతిభను చాటాలని అధికారులు సూచించారు.

నిర్మల్

నిర్మల్‌లో వైభవంగా వినాయకుల శోభాయాత్ర

నిర్మల్: పట్టణంలో పలు రోజులుగా ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలందుకున్న భారీ వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వైభవంగా కొనసాగుతోంది. వివిధ రూపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకునేందుకు పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.