Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

తాండ్రలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

*తాండ్రలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. లబ్ధిదారులకు కార్డులు అందజేసిన కూచాడి శ్రీహరిరావు* మామడ మండలంలోని తాండ్ర గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాపాలనను కొనసాగిస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ రేషన్ సరుకులు సులభంగా అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలు కలుగుతుందని శ్రీహరిరావు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల సంక్షేమం, పేద కుటుంబాలకు అండగా నిలవడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రత మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గారు, తాండ్ర గ్రామ సర్పంచ్ కస్తూరి భాస్కర్ గారు, తాండ్ర ఉప సర్పంచ్ రాథోడ్ సూషేన్ ,గయద్ పల్లి గ్రామ సర్పంచ్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాథోడ్ సంతోష్ గారు, మొండిగుట్ట గ్రామ సర్పంచ్ భీమేష్ గారు, వస్తాపూర్ సర్పంచ్ భూమారెడ్డి,బురుగుపల్లి సర్పంచి భూమన్న,గొండుగూడ సర్పంచు భీంరావు, మాజీ ఎంపీపీ జైసింగ్,మాజీ ఎంపీటీసీ అన్వర్ కిషన్రావుపేట్ సర్పంచ్ రాథోడ్ వసంత్,పొన్కల్ గంగారెడ్డి,కైరి రాకేష్ గౌడ్,బాదావత్ రమేష్,సాయగౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువత, లబ్ధిదారులు పాల్గొన్నారు.

నిర్మల్

తాగునీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో గ్రామసభ బహిష్కరణ

కుబీర్ మండలం.నిఘ్వ:గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో తాగునీటి సమస్యలు, పారిశుధ్యంపై చర్చ జరిగింది. గతంలో నిర్వహించిన జనరల్‌ బాడీ సమావేశాలు, గ్రామసభల్లో చేసిన తీర్మానాల మేరకు ఎస్సీ కాలనీ, ఆబాజీ మొదటి వార్డులో తాగునీటి ఎద్దడి నివారణకు బోర్లు వేయాలని నిర్ణయించినా ఇప్పటివరకు పనులు చేపట్టలేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బోర్లు ఉన్న ప్రాంతాల్లో మినీ ట్యాంకులు, ఆరు నీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని తీర్మానించినప్పటికీ అధికారులు, సర్పంచ్‌ స్పందించలేదని ఆరోపించారు. గ్రామంలోని తాగునీటి ట్యాంకుల పరిశుభ్రత, పారిశుధ్యంపై కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉపసర్పంచ్‌ దిగంబర్‌ పటేల్‌తో పాటు వార్డు సభ్యులు బన్నెల్లి సత్యనారాయణ, అరవేకర్‌ పోతన్న, కోటగిరి ప్రవీణ్‌, పొదుగంటి లక్ష్మణ్‌, గుంజేటి రాధిక గ్రామసభను బహిష్కరించారు.

నిర్మల్

ప్రజాసేవకు ప్రతీక ఏ. భీమ్‌రెడ్డి

మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల్లో 33వ వర్ధంతి కార్యక్రమాలు లక్ష్మణ్‌చందా మండలం: మాజీ డిప్యూటీ స్పీకర్ ఏ. భీమ్‌రెడ్డి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన అందించిన ప్రజాసేవ, రాజకీయ ప్రస్థానాన్ని స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఏ. భీమ్‌రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమ్‌రెడ్డి కుమార్తె, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ స్వర్ణరెడ్డి, కుమారుడు భూపాల్‌రెడ్డితో పాటు మునిపెల్లి, మల్లాపూర్ గ్రామాల ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్, నిర్మల్

నిర్మల్

కులమతాలకు అతీతంగా మానవత్వమే గొప్పది

అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన అంజద్ ఖాన్ అమన్ నిర్మల్, పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన మానవత్వమని చాటుతూ, అర్ధరాత్రి సమయంలోనూ స్పందించి అత్యవసరంగా రక్తదానం చేసిన అంజద్ ఖాన్ అమన్ అభినందనీయమైన సేవ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగికి సకాలంలో రక్తాన్ని అందించి ప్రాణరక్షణకు సహకరించారు. “అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పది” అనే సందేశంతో తెలంగాణ ముస్లిం ఏక్తా సోషల్ వెల్ఫేర్ సొసైటీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని షేక్ ముజాహిద్ తెలిపారు ఆరోగ్యపరంగానే కాకుండా, అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన సహాయం అందించేందుకు కూడా సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. సొసైటీ ఉపాధ్యక్షులు సాజిద్ మాట్లాడుతూ అంజద్ ఖాన్ అమన్ ఎప్పుడు పిలిచినా స్పందించి రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని, ఆయన సేవాభావం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ ముజాహిద్, సాజిద్, వాజిద్, ఆఫ్రోజ్ పాషా ఖాన్, ఖానాపూర్ బీఆర్‌ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు సర్జిల్ ఖాన్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

40 మంది లబ్ధిదారులకు రూ.13.39 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు

లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన కూచాడి శ్రీహరిరావు నిర్మల్: ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. నిర్మల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.13 లక్షల 39 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. వైద్య ఖర్చులు, అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, కూచాడి శ్రీహరిరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

అనారోగ్యంతో ఉన్న గాండ్ల విలాస్‌ను పరామర్శించిన కూచాడి శ్రీహరిరావు

పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్ నిర్మల్: నిలాయిపేట గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గాండ్ల విలాస్ ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడి చేతికి గాయం కావడంతో, విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా విలాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సాయన్న, భాగ్యనగర్ మాజీ సర్పంచ్ భూమయ్య, గాండ్ల రవి, పుస్కూరి గంగయ్య , కుంట నవీన్ కుమార్, పోతగండి శ్రీను తదితరులు పాల్గొని గాండ్ల విలాస్‌ను పరామర్శించారు.

నిర్మల్

ప్రజాపాలన స్ఫూర్తితో పట్టణ అభివృద్ధికి కృషి

నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్మల్, సెప్టెంబర్ 17: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా కూచాడి శ్రీహరిరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు హాజరయ్యారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజల సంక్షేమం, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రజాపాలన స్ఫూర్తితో పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో పాలన ప్రజలకు అందుబాటులో ఉండేలా మున్సిపల్ పాలనను మరింత బలోపేతం చేసి, నిర్మల్ పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

నిర్మల్

నిర్మల్ రూరల్: మెడిపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో గ్రామానికి రూ.3.50 కోట్ల అభివృద్ధి పనులు పున్నమి ప్రతినిధి – అబ్దుల్ సాదిక్ నిర్మల్ రూరల్: నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో మెడిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో గ్రామంలో 50 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు లభించిందని తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంతో పాటు ఎస్‌హెచ్‌–44 నుంచి మెడిపల్లి వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు రూ.3.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని సోమ భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రానున్న రోజుల్లో మెడిపల్లిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.

నిర్మల్

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు నీటి విడుదల 20 వేల ఎకరాల పంటలకు ప్రయోజనం.. మూడు మండలాల రైతులకు ఊరట నిర్మల్: సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతులకు ఊరట లభించింది. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు ఆదివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో మూడు మండలాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు శ్రీహరిరావు సమస్యను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. శ్రీహరిరావు విజ్ఞప్తిపై మంత్రి అధికారులతో చర్చించి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మూడు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, కాలువకు నీటి విడుదలతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. నీటిని వారాబందీ పద్ధతిలో విడుదల చేయనున్నందున రైతులు పరస్పర సమన్వయంతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆత్మ చైర్మన్ కొండ్రు రామ్‌రెడ్డి, గండి రామన్న, దత్తసాయి ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, లక్ష్మణచాందా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, మామడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్, బాపయ్య, ప్రతాప్‌రెడ్డి, గంగారెడ్డి కలగిరి తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు

శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు నీటి విడుదల 20 వేల ఎకరాల పంటలకు ప్రయోజనం.. మూడు మండలాల రైతులకు ఊరట నిర్మల్: సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల రైతులకు ఊరట లభించింది. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు ప్రత్యేక చొరవతో సరస్వతి కాలువకు ఆదివారం ఉదయం నీటిని విడుదల చేయనున్నట్లు నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్మల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో మూడు మండలాల్లో సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు శ్రీహరిరావు సమస్యను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారని తెలిపారు. శ్రీహరిరావు విజ్ఞప్తిపై మంత్రి అధికారులతో చర్చించి సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మూడు మండలాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సోన్, లక్ష్మణచాందా, మామడ మండలాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని, కాలువకు నీటి విడుదలతో రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. నీటిని వారాబందీ పద్ధతిలో విడుదల చేయనున్నందున రైతులు పరస్పర సమన్వయంతో నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆత్మ చైర్మన్ కొండ్రు రామ్‌రెడ్డి, గండి రామన్న, దత్తసాయి ఆలయ చైర్మన్ కొట్టె శేఖర్, లక్ష్మణచాందా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి, మామడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్, బాపయ్య, ప్రతాప్‌రెడ్డి, గంగారెడ్డి కలగిరి తదితరులు పాల్గొన్నారు.