Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

అపోహలు వద్దు..! ఆరోగ్యశ్రీ ముద్దు…! డాక్టర్. అనిల్ కుమార్ జాదవ్ గారు.

బైంసా : అపోహలు విడిచి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు పొందాలని జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. కొంతమంది ఆరోగ్యశ్రీ పథకమును వక్రీకరించడం, ప్రజలను తప్పుదారి పట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది సమంజసమైన పద్ధతి కాదని ఆయన హితువు పలికారు. గాయాలపాలై ఎముకలు విరిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా అప్రూవల్ (Approval) రావటానికి మూడు, నాలుగు రోజులు పడుతుందని, ఈ మూడు, నాలుగు రోజులలో ఇరిగిన ఎముక ప్రాంతం చెడిపోతుందని, నాణ్యమైన ఇంప్లాంట్ వేయరని చెప్పడం శుద్ధ అబద్ధమని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అపోహాలను నమ్మకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని నయా పైసా ఖర్చు చేయకుండా మొత్తం సేవలు ఉచితంగా పొందవచ్చని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలు 1. గాయాలపాలైనప్పుడు అన్ని రకాల విరిగిన ఎముకలకు ఉచిత చికిత్స చేస్తారు. 2.ఇరువైనాలుగు గంటలలోపు అప్రూవల్ లభిస్తుంది. 3. నాణ్యమైన ఇంప్లాంట్ వేస్తారు. 4. రోగి ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనం ఉచితంగా ఇవ్వబడుతుంది 5. రోగి డిశ్చార్జ్ అయినప్పుడు ఆసుపత్రి నుంచి ఇంటి వరకు ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది. 6. ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఉచితంగా మందులు ఇవ్వబడును. 7. ఈ సౌకర్యాలన్ని మన జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజలారా! ప్రభుత్వం ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడు రూ పదివేల నుంచి 15 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? ఆలోచించండి. ఈ డబ్బులే మీ దగ్గర ఉంటే ఇంటికి వెళ్లిన తర్వాత పౌష్టికాహారం తినవచ్చు కదా! ఈ డబ్బుల కోసం అప్పు చేసి తిప్పలు పడడం ఎందుకు? ఒక్కసారి మీరే ఆలోచించాలి. అంటూ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ఆరోగ్యశ్రీ అందిస్తున్నటువంటి వైద్య సేవలను ప్రజలకు వివరించారు.

నిర్మల్

నిర్మల్: 16 బృందాలతో భూ సర్వే వేగవంతం చేయాలి

నిర్మల్ జిల్లాలో అందుబాటులో ఉన్న 16 సర్వే బృందాలను పూర్తిస్థాయిలో వినియోగించి, 16 ప్రత్యేక బృందాలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. బృందాలు సమన్వయంతో పనిచేసి నిర్దేశిత విధానాలను పాటించాలని ఆదేశించారు. భూమి యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించి, వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.

నిర్మల్

కుబీర్‌లో రేపు శ్రీ వరసిద్ధి కర్ర గణపతి హారతి, లడ్డూ వేలం

కుబీర్, సెప్టెంబర్ 24:కుబీర్ గ్రామంలోని విట్టలేశ్వర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక హారతి,అనంతరం లడ్డూ వేలం పాట నిర్వహించనున్నారు. అలాగే భక్తుల కోసం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ పేర్కొంది. ఈ కార్యక్రమానికి కుబీర్ గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపతి ఆశీస్సులు పొందడంతో పాటు లడ్డూ వేలం పాటలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

నిర్మల్

పార్డి (బి)లో ఘనంగా కర్ర గణనాథుడి శోభాయాత్ర. రూ.48 వేలకు లడ్డూ వేలంపాట దక్కించుకున్న ఇర్ల రాజేశ్వర్

కుబీర్:మండలంలోని పార్డి (బి) గ్రామంలో గణనాథుల నిమజ్జన శోభాయాత్రను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గణేష్ విగ్రహాలను రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన రథాల్లో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి జైకొడుతూ సందడి చేశారు.తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణేష్ లడ్డూను వేలం వేయగా, గ్రామానికి చెందిన ఇర్ల రాజేశ్వర్ రూ.48 వేల కు దక్కించుకున్నారు.శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్, గ్రామస్తులు చిమ్మన్ పోశెట్టి, తూము శంకర్, రాజేశ్వర్, సురేష్ బాబు, మోహన్, రాజన్న, రమేష్, కుల సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

పాలజ్ శ్రీ గణేష్ ఆలయంలో పూజలందుకున్న వస్తువుల వేలం కర్ర గణపతి చెంత 12 రోజుల పాటు పూజలు.. తేదీ :24న వేలం

కుబీర్: కుబీర్ మండలం సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పాలజ్ గణేష్ ఆలయంలో** గణేష్ ఉత్సవాల సందర్భంగా పూజలందుకున్న వస్తువులను వేలం వేయనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది.గణేష్ ఉత్సవాల సందర్భంగా 12 రోజుల పాటు పాలజ్ కర్ర గణపతి చెంత పూజలందుకున్న పలక, బలపం, కాపీ–పెన్ను, లాకర్, కండువా, మహా లడ్డూ తదితర వస్తువులను వేలం వేయనున్నట్లు తెలిపింది. ఈ వస్తువులను వేలం ద్వారా భక్తులకు అందించనున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ నెల 24వ తేదీన (24-09-2026) ఉదయం 7 గంటలకు పాలజ్ శ్రీ గణేష్ మందిర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేలం కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజలందుకున్న వస్తువులను పొందేందుకు భక్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ కోరింది.

నిర్మల్

భక్తులతో కిటకిటలాడిన విఠలేశ్వరాలయం.. వరసిద్ధి వినాయకుడికి ఘన ఆరతి

కుబీర్:మండల కేంద్రంలోని ప్రాచీన విఠలేశ్వర ఆలయంలో కొలువుదీరిన,వరసిద్ధి వినాయకుడికి మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేకఆరతికార్యక్రమంనిర్వహించారు.గత15సంవత్సరాలుగా,ఆలయంలో ప్రతిష్ఠిస్తున్న ఈ విశిష్ట కర్ర గణపయ్యను దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఆరతి కార్యక్రమం సందర్భంగా విఠలేశ్వర ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరతిలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు బారులు తీరారు.విఘ్నాలను తొలగించి కోరిన కోరికలు నెరవేర్చే వరసిద్ధి వినాయకుడిగా ఈ కర్ర గణపయ్యకు భక్తుల్లో విశేషమైన నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రుల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తుల“గణపతి బప్పా మోరియా”నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ప్రత్యేక ఆరతి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

నిర్మల్

హామీ మాటల్లో కాదు.. నిర్మల్‌కు యూనివర్సిటీ చేతల్లో కావాలి!

బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ డిమాండ్ నిర్మల్: నిర్మల్ జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. స్థానికంగానే డిగ్రీ, పీజీతో పాటు ఉన్నత విద్యా అవకాశాలు అందుబాటులోకి రావాలన్నారు. 2026 జనవరి 16న నిర్మల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాసర ట్రిపుల్‌ఐటీలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, ఆ హామీని అమలు చేసి విద్యార్థులకు త్వరగా యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకురావాలని షోయేబ్ కోరారు. పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్ – నిర్మల్

నిర్మల్

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయం

శశి హార్ట్ కేర్ సెంటర్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ నిర్మల్, సెప్టెంబర్ 21: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శశి హార్ట్ కేర్ సెంటర్‌ను బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, హృదయ సంబంధిత చికిత్సలు, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆయన వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మిర్జా షోయేబ్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజలకు నాణ్యమైన హృదయ వైద్య సేవలు అందించే ఆసుపత్రి ఉండటం అభినందనీయమన్నారు. ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు స్థానికంగానే అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్, నిర్మల్

నిర్మల్

నిర్మల్ అభివృద్ధికి నిధులివ్వండి.. పనులు పరుగులు పెట్టించండి!

ప్రభుత్వ సలహాదారు, పీసీసీ అధ్యక్షుడికి మైనారిటీ కౌన్సిలర్ల వినతి పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్ – నిర్మల్ నిర్మల్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని మైనారిటీ కౌన్సిలర్ల ప్రతినిధి బృందం ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. మాజీ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఈ వినతిని సమర్పించారు. నగర అభివృద్ధి పథకం కింద పెండింగ్‌లో ఉన్న రూ.15 కోట్లు, అలాగే TUFIDC కింద కేటాయించిన రూ.50 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిధులు విడుదలైతే మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను వేగవంతం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్ (రఫ్ఫు), రఫీ, జాకీర్, ఇర్ఫాన్, షేక్ సల్మాన్, జాకీ, షేక్ ఫిరోజ్, ఐవైసీ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ నుమాన్ పాల్గొన్నారు.

నిర్మల్

శశి హార్ట్ కేర్ సెంటర్ ప్రారంభం

నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నిర్మల్: స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశి హార్ట్ కేర్ సెంటర్‌ను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆదివారం నిర్మల్ పట్టణంలోని డాక్టర్స్ లేన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు నూతనంగా ప్రారంభమైన శశి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా స్థానికంగానే గుండె వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. గుండె సంబంధిత సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ శశికాంత్, డాక్టర్ స్వప్న, రవిపుల రాంనాథ్ తదితరులు పాల్గొన్నారు. — పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్, నిర్మల్