Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

వర్షంలోనూ తగ్గని పోరాటం.. కాంట్రాక్టర్ల రిలే దీక్ష కొనసాగింపు

భైంసా: సెప్టెంబర్. 12 పున్నమి ప్రతినిధి. మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి నాలుగో రోజుకు చేరుకుంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంట్రాక్టర్లు దీక్షను కొనసాగిస్తున్నారు. తమకు రావాల్సిన బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు, ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటివరకు మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. Uploaded Video:

నిర్మల్

కుబీర్‌లో ఘనంగా పోలాల అమావాస్య వేడుకలు రంగురంగుల అలంకరణలతో ముస్తాబైన బసవన్నలు….బాజాభజంత్రీలతో ఘనంగా ర్యాలీ.

కుబీర్: (సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి .) మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గురువారం పోలాల అమావాస్యను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు బసవన్నలను రంగురంగుల వస్త్రాలు, పూలమాలలు, అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేశారు.కుబీర్‌లో వివేకానంద చౌరస్తా నుంచి బసవన్నలతో బాజాభజంత్రీల నడుమ ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ విఠలేశ్వర ఆలయానికి చేరుకుంది. అనంతరం హనుమాన్ ఆలయం చుట్టూ బసవన్నలతో ప్రదర్శన నిర్వహించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత బసవన్నలను ఇళ్లకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. వేడుకల్లో రైతులు, మహిళలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

నిర్మల్

విద్యా సేవలకు కిరీటం.. షబ్బీర్ అహ్మద్‌కు ఘన సన్మానం

నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్మల్ జిల్లా: ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఐడియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు షబ్బీర్ అహ్మద్ను నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. విద్యారంగంలో అంకితభావంతో సేవలందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న షబ్బీర్ అహ్మద్‌కు లభించిన ఈ గౌరవం అభినందనీయమని యాజమాన్య ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య ప్రతినిధులు, పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని షబ్బీర్ అహ్మద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. – పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్ | నిర్మల్ జిల్లా

నిర్మల్

ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలనతో అర్హులైన వారికి నష్టం ఉండదు

నిర్మల్‌లో ఓటర్ల జాబితాపై బీఆర్‌ఎస్‌ నేతల వినతి.. అభ్యంతరాలను పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ నిర్మల్: ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలనలో భాగంగా అర్హులైన ఓటర్లకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు సునీల్ కుమార్ రావు అధికారులను కోరారు. పట్టణంలోని ఆదర్శనగర్ 259, 256 పోలింగ్ స్టేషన్‌లలో నోటీసులు అందిన వారందరినీ నిశితంగా పరిశీలించి, ఆధారిత పత్రాలను సమర్పించుకునే అవకాశం కల్పించాలని కోరారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు పల్లి కొండ రాజు, సత్యనారాయణ, మహమ్మద్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్లకు న్యాయం చేయాలని వారు కోరారు.

నిర్మల్

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు

కేసీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి – తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి నిర్మల్‌లో కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మల దహనం నిర్మల్, మంగళవారం: శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ శ్రీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్, తాతా మధు దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాలు, సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సయ్యద్ అర్జుమాంద్ ఆలీ మాట్లాడుతూ, శాసనసభ స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడమేనని అన్నారు. తక్షణమే కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, కౌన్సిలర్ చిన్ను, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

నిర్మల్

మహిళా ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా నిర్మల్‌లో భారీ ప్రదర్శన

సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీలకు మద్దతుగా మహిళల ఆందోళన బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తల భారీ పాల్గొనడం నిర్మల్: మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీల అరెస్టు/ధర్నా ఘటనను నిరసిస్తూ నిర్మల్ పట్టణంలో మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, బైంసా నియోజకవర్గ కోఆర్డినేటర్ పడకండి రమాదేవి పాల్గొని మహిళా ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపారు. అలాగే కే. సుశీల్ కుమార్ రావు, మాజీ బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి, నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, రాష్ట్ర సీనియర్ నాయకులు నామతాబాద్ శివాజీ, జిల్లా సీనియర్ నాయకులు ఎం.డి. మహబూబ్, జిల్లా యువజన నాయకుడు జుబేర్, టౌన్ సెక్రటరీ నయీమ్ మసూద్, టౌన్ సీనియర్ నాయకుడు అజీజ్ చౌస్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని నాయకులు డిమాండ్ చేశారు. మహిళల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

నిర్మల్

ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా నిర్మల్‌లో బీఆర్‌ఎస్ కదం తొక్కింది!

ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా నిర్మల్‌లో బీఆర్‌ఎస్ కదం తొక్కింది!కేటీఆర్ సహా పలువురు నేతలకు గాయాలు.. ఘటనపై బీఆర్‌ఎస్ శ్రేణుల తీవ్ర ఆగ్రహం భారీ బైక్ ర్యాలీతో కలెక్టర్ కార్యాలయానికి తరలివెళ్లిన నాయకులు ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం పున్నమి ప్రతినిధి: అబ్దుల్ సాదిక్, నిర్మల్: బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మహిళా మాజీ మంత్రులు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితర నాయకులతో జరిగిన ఘటనలు, ఎమ్మెల్యేల అరెస్టులను నిరసిస్తూ నిర్మల్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనలో కేటీఆర్ ముఖం, చేతికి గాయాలయ్యాయని, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాలికి గాయమైనట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. సునీత లక్ష్మారెడ్డిని చూసి కేటీఆర్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు షర్టు చినిగిన ఘటనపైనా బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. బైక్ ర్యాలీతో నిరసన.. కలెక్టర్‌కు వినతిపత్రం ఎమ్మెల్యేల అరెస్టులకు నిరసనగా నిర్మల్ పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అరెస్టు చేసిన ప్రజాప్రతినిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలను అణచివేయొద్దు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులు, ప్రజాప్రతినిధులపై నిర్బంధాలు, అరెస్టులు చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం గౌరవించాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి కే. సుశీల్ కుమార్ రావు, బీఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, బీఆర్‌ఎస్వీ నాయకులు బి. సాయికుమార్, నిర్మల్ జిల్లా సీనియర్ నాయకులు ఎండి. మైబూబ్, జిల్లా యువజన విభాగం నాయకులు జుబేర్, టౌన్ సెక్రటరీలు నయీమ్, మసూద్, టౌన్ మైనార్టీ సెక్రటరీ ఎండి. అజీజ్, పార్టీ సీనియర్ కార్యకర్త భీమేష్, వైఎస్సార్ కాలనీ కౌన్సిలర్ అభ్యర్థి మినార్ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

నిర్మల్

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముందస్తు అరెస్ట్

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 07 (పున్నమి ప్రతినిధి) ముధోల్: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి, మహిళలకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు పూర్తిస్థాయి మహిళా హోం మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ముదోల్ నియోజకవర్గ లోకేశ్వరం మండల్ కి చెందిన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్కరి చిన్నన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌లను జిల్కరి చిన్నన్న తీవ్రంగా ఖండించారు. శిరీషకు న్యాయం చేయాలని, ఆమె కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని అన్నారు. మహిళల భద్రత, న్యాయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నిర్మల్

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలనకు ఘన విజయోత్సవం

నిర్మల్‌లో 1000కు పైగా బైకులతో భారీ ర్యాలీ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్మల్, సెప్టెంబర్ 6: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు, నిర్మల్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో 1000కు పైగా బైకులతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో నిర్మల్‌లో కాంగ్రెస్ శ్రేణుల్లో విజయోత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు, ముథోల్ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణ్ రావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రతి మండలం నుంచి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మ చైర్మన్లు, ఆలయ చైర్మన్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, బీఎల్ఏలు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సెల్‌ల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు బైక్ ర్యాలీని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల ఐక్యత, ఉత్సాహం, భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ ఘన విజయాన్ని సాధించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.