संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: NIRMAL

నిర్మల్

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది కూచాడి శ్రీహరిరావు

నిర్మల్, సెప్టెంబర్ 1: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన నర్సయ్య వేములకుర్తి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన ఎల్‌ఓసీ పత్రాన్ని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరిరావు అందజేశారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల సహాయాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని కూచాడి శ్రీహరిరావు బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అనారోగ్య సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అర్హులైన వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం విషయంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన సహాయం అందేలా తన వంతు కృషి చేస్తానని కూచాడి శ్రీహరిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొన్కల్ మాజీ ఎంపీటీసీ లింగన్న, అనంతపేట్ సర్పంచ్ తిరుమల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలి

సమస్యలు పరిష్కరించే వరకు BRSV ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం నిర్మల్: నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ BRSV ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. BRSV రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు BRSV నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు షోయబ్ మీర్జా తెలిపారు. ధర్నా కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు ముందస్తుగా BRSV నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు షోయబ్ మీర్జాతో పాటు పలువురు BRSV కార్యకర్తలను ఉదయం 8 గంటల సమయంలో వారి ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా షోయబ్ మీర్జా మాట్లాడుతూ.. నిర్మల్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు BRSV ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి విద్యార్థుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ ఇంతియాజ్ హైమద్, అదుముల్ల విశాల్, నేహాల్ ఖాన్, సయ్యద్ ఫసి, మహ్మద్ ముఖీం తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంచాలి BRS నేత G. రమేష్

రేషన్ బియ్యం పంపిణీ గడువు పెంచాలి: రమేష్ నిర్మల్: రేషన్ బియ్యం పంపిణీకి ఒక్కరోజే గడువు ఇవ్వడంతో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ నేత. G రమేష్ అన్నారు. కొన్ని రేషన్ దుకాణాల్లో 60 శాతం బియ్యం కూడా పంపిణీ కాలేదని తెలిపారు. రేషన్ డీలర్లు షాపులు మూసివేసి వివాహ కార్యక్రమాలకు వెళ్లారని ఆయన ఆరోపించారు. రేషన్ బియ్యం పంపిణీ గడువును మరో రెండు వారాలు పొడిగించాలని డిమాండ్ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నయీమ్ మరియు జుబేర్ పాల్గొన్నారు

నిర్మల్

వడ్యాల్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

లక్ష్మణ్‌చందా: నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందా మండలం వడ్యాల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమై, అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, లక్ష్మణ్‌చందా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే. నరేష్ రెడ్డి, మోహన్, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిర్మల్

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్మల్

ఆగస్టు 29, 2026-నిర్మల్ *ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం* *మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి వేడుకలు* జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి వేడుకలను నిర్మల్‌లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ భవేష్ మిశ్రా ఆదేశాలతో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా హాకీ అసోసియేషన్‌ సహ ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల అధికారి బి. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత హాకీకి ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చేసిన కృషి, ఆయన ప్రతిభ, అంకితభావం చిరస్మరణీయమని అన్నారు. ధ్యాన్‌చంద్‌ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం కావాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు క్రీడా కోటా ద్వారా ప్రభుత్వంతో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను గుర్తించి క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రాథోడ్‌ లక్ష్మణ్, జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాకాల రాంచందర్, పీడీలు రమణారావు, రవీందర్‌గౌడ్, అన్నపూర్ణ, భూమన్న, సత్తయ్య, బుచ్చిరామారావు, సుధార్‌సింగ్, పోశెట్టి, వంశీ, కె. శ్రీనివాస్, పీఈటీలు సంజీవ్, గంగాధర్, ముకేష్, భీమేశ్, గిరి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, యువత తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

Congress party leader Mr. Mohsin khan urges voters not to fear from SIR.

In bhainsa, BLo’s are started issuing the notices to the voters. Majority of voters have received the SIR notices. Many people are worried because they don’t have proper documents related to name mismatch between last SIR and current roll, age discrepancy , six or more siblings, siblings age less than 9months and so on. On behalf of Congress party Mr. Mohsin Khan request the people of Mudhole constituency to contact us for any kind of legal guidance and support. And he advised the voters that don’t fear from SIR instead face the SIR. We are available 24/7 at your service. Contact: 9908428746.

నిర్మల్

Congress party leader Mr. Mohsin khan urges voters not to fear from SIR.

In bhainsa, BLo’s are started issuing the notices to the voters. Majority of voters have received the SIR notices. Many people are worried because they don’t have proper documents related to name mismatch between last SIR and current roll, age discrepancy , six or more siblings, siblings age less than 9months and so on. On behalf of Congress party Mr. Mohsin Khan request the people of Mudhole constituency to contact us for any kind of legal guidance and support. And he advised the voters that don’t fear from SIR instead face the SIR. We are available 24/7 at your service. Contact: 9908428746.

నిర్మల్

వార్డు నెంబర్ 21లో SIR. నోటీసులపై ఎమ్మార్వో వివరణ

వార్డు నెంబర్ 21లో నోటీసులపై ఎమ్మార్వో వివరణ నిర్మల్: నిర్మల్ అర్బన్ పరిధిలోని వార్డు నెంబర్ 21లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులపై ఎమ్మార్వో రాజు గారు.  ప్రజలకు వివరణ ఇచ్చారు. నోటీసులకు సంబంధించి ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, నోటీసులు అందుకున్న వారు నిర్దేశిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నోటీసులు అందుకున్న వారికి 10 రోజుల వరకు వాటిని స్వీకరించి, అవసరమైన వివరాలు సమర్పించుకునే అవకాశం ఉంటుందని ఎమ్మార్వో రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో  నాయబ్  తాసిల్దార్ శేఖర్. వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ షేక్, బీఎల్ఏలు నదీమ్ షేక్, ఇఫ్తాకర్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

నిర్మల్

GO 97 రద్దు కోసం BRSV ధర్నాకు భారీగా తరలిరండి

నిర్మల్: తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను ‘శక్తి’ (SHAKTI) విభాగంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన GO నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ BRSV నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం, ఆగస్టు 31న ధర్నా నిర్వహించనున్నారు. ఈ ధర్నాకు BRSV నాయకులు, కార్యకర్తలు, పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BRSV జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని GO 97ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.

నిర్మల్

కొట్టె శేఖర్‌కు ఘన సత్కారం

ఇటీవల నూతనంగా శ్రీ గండి రామన్న ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన కొట్టె. శేఖర్ గారిని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ గారు శాలువా తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. సోమ. భీంరెడ్డి, ఆత్మ చైర్మన్ కొండ్రు. రాంరెడ్డి,సీనియర్ ఉర్దూ రిపోర్టర్ సయ్యద్. అజార్ జలీల్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాజుల. రవి కుమార్, కార్యదర్శి. ఎం.డీ. జీషాన్ అలీ,నాయకులు పేశ్వకర్. రమేష్ గార్లు పాల్గొన్నారు. 💐