संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: NIRMAL

నిర్మల్

సమీక్షల పేరుతో కాలయాపన వద్దు.. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలి

*సమీక్షల పేరుతో కాలయాపన వద్దు.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపండి: బీఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్* నిర్మల్ జిల్లాలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటనపై బీఆర్ఎస్వి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ విమర్శలు చేశారు. మంత్రుల పర్యటన ప్రజా సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి పరిశీలన కంటే విహారయాత్రకు వచ్చినట్లుగా సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అనేకం ఉన్నాయని మిర్జా షోయేబ్ అన్నారు. అలాంటి సమస్యలపై మంత్రులు ప్రత్యేకంగా ప్రజా దర్బార్ నిర్వహించి, బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అటవీ–రెవెన్యూ సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర అంశాలపై ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రులు ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారులకు గడువుతో కూడిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రతి భూమికి ‘భూధార్’ నంబర్, సమగ్ర భూసర్వే, పేదలకు ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయో స్పష్టం చేయాలని మిర్జా షోయేబ్ ప్రశ్నించారు. మంత్రులు కేవలం సమీక్ష సమావేశాలు, శంకుస్థాపన కార్యక్రమాలకే పరిమితం కాకుండా గ్రామాలు, పట్టణంలోని కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాని ప్రతి సమస్యను ప్రజా దర్బార్ ద్వారా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మిర్జా షోయేబ్ డిమాండ్ చేశారు.

నిర్మల్

బోథ్ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రెవెన్యూ డివిజన్‌, ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, డయాలసిస్ సెంటర్‌ మంజూరు చేయాలి నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ–రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. బోథ్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయని ఎమ్మెల్యే కోరారు. అలాగే ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బోథ్‌కు మంజూరైన డయాలసిస్ సెంటర్‌ తరలిపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బోథ్‌లోనే డయాలసిస్ సెంటర్‌ను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా ఇచ్చొడలో పెరుగుతున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (CHC) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నెరడిగొండ, బజార్‌హత్నూర్‌ మండలాల్లో అటవీ శాఖకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించాలని, అటవీ అధికారుల వైఖరి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన గిరిజనేతరులకు అటవీ హక్కు పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బోథ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రులను కోరారు.

నిర్మల్

పార్కింగ్‌ సదుపాయం లేని మాల్స్‌పై చర్యలు తీసుకోవాలి

పున్నమి ప్రతినిధి :నిర్మల్‌లో ట్రాఫిక్‌ సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు నిర్మల్: పట్టణంలోని పలు షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, మార్టుల వద్ద సరైన పార్కింగ్‌ సదుపాయం లేకపోవడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చందనా బ్రదర్స్‌, చెన్నై షాపింగ్‌, మాంగల్య తదితర వాణిజ్య సంస్థల వద్ద వాహనాలను రోడ్లు, ఫుట్‌పాత్‌లపై నిలిపివేయడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటోందని, అంబులెన్సులు, పాఠశాల బస్సులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాల్స్‌ ముందు రోడ్లపై ప్రకటన బోర్డులు, వస్త్ర స్టాండ్లు, ఇతర సామగ్రి ఏర్పాటు చేయడంతో పాటు పండుగల సమయంలో టెంట్లు, లైట్లు ఏర్పాటు చేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. పార్కింగ్‌ నిబంధనలపై పట్టణంలోని అన్ని మాల్స్‌, మార్టులపై సమగ్ర సర్వే నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలని కోరారు. అవసరమైతే ట్రేడ్‌ లైసెన్సులపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపే వారిపై ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు విధించాలని విజ్ఞప్తి చేశారు. చిరు వ్యాపారులపై మాత్రమే కాకుండా పెద్ద వాణిజ్య సంస్థల ఆక్రమణలపైనా సమానంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్‌ చేశారు. ఫిర్యాదు ప్రతులను అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌), నిర్మల్‌ జిల్లా ఎస్పీకి కూడా సమర్పించినట్లు తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అవసరమైతే తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని ఫిర్యాదుదారులు మీర్జా షోయేబ్‌, షేక్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, మొహమ్మద్‌ మినాజ్‌, మొహమ్మద్‌ మొఖీమ్‌, మహమ్మద్‌ ఫసి తెలిపారు.

నిర్మల్

నిర్మల్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత

అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు, కాంగ్రెస్ నేతల పాల్గొనడం నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు, జిల్లా లైబ్రరీ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ, మాజీ జెడ్పీటీసీ పత్తి రాజేశ్వర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

నిర్మల్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు నిర్మల్ జిల్లా పర్యటన

నిర్మల్, అక్టోబర్ 4: తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార–ప్రజా సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం (అక్టోబర్ 5) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:45 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్‌కు చేరుకోనున్న మంత్రి, 10 గంటలకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం 10:30 గంటలకు గృహ నిర్మాణం, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 3:30 గంటలకు ఐడీఓసీ హెలిప్యాడ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

నిర్మల్

ఎంబీబీఎస్ సీటు సాధించిన మంజుల రాజేశ్వర్ కుమారుడికి ఘన సన్మానం

నిర్మల్ పున్నమి ప్రతినిధి: లక్ష్మణచందా మండలానికి చెందిన ఓస మంజుల–రాజేశ్వర్ దంపతుల కుమారుడికి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు లభించడంతో కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, నిర్మల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు సిరాజ్, కల్లెడ భూమన్న, ఓస రవీందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్

బాధిత కుటుంబాన్ని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు…

భైంసా : బైంసా మండలంలోని పాంగ్రి గ్రామానికి చెందిన నారాయణ పటేల్ గారి భార్య కుసుంబాయి గారు అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.

నిర్మల్

నైపుణ్యంతోనే మహిళా సాధికారత. స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటిల్

**భైంసా, అక్టోబర్ 3 (పున్నమి):** యువతులు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధించి స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. భైంసా పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు నిర్వహించిన సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో వృత్తి నైపుణ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవచ్చన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను యువతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున కుట్టు మిషన్లు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.యువతులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్న శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ సేవలను ఎమ్మెల్యే అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకుని యువతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, ఎస్‌ఆర్‌టీ, ఆర్‌ఐ చైర్మన్ కిషోర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి ఆప్ నేతల ఘన నివాళులు నిర్మల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ సమీపంలో గల గాంధీ పార్క్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా గాంధీజీ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్ కుమార్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, నియోజకవర్గ ఇంచార్జి మెరుగు రాజన్న, స్పోక్స్‌పర్సన్ వసంత్ రావు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

నిర్మల్

గాంధీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: కూచాడి శ్రీహరిరావు

నిర్మల్: గాంధీ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి, ఐక్యత సిద్ధాంతాలు నేటి సమాజానికి ఆదర్శప్రాయమని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల బాటలో నడవాలని శ్రీహరిరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ – అబ్దుల్ సాదిక్, నిర్మల్ జిల్లా