Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

Congress party leader Mr. Md Rahman Khan (Mohsin) urges the people not to fear SIR instead face S.I.R

In bhainsa, BLo’s are issuing the notices to the voters. Majority of voters have received the SIR notices. Many people are worried because they don’t have proper documents related to name mismatch between last SIR and current roll, age discrepancy , six or more siblings, siblings age less than 9months and so on. On behalf of Congress party Mr. Md. Rahman Khan (Mohsin) requested the people of Mudhole constituency to contact us for any kind of legal guidance and support. And he advised the voters that don’t be afraid of SIR instead face the SIR. And also he requested the AERO / MRO to co-operate with people of Mudhole Constituency. We are available 24/7 at your service. Contact: 9908428746.

నిర్మల్

Massive Congress Party Bike Rally in Nirmal District Headquarters!

Nirmal: A massive bike rally was organized today in the Nirmal under the leadership of Sri Vedma Bojju Patel and Srihari Rao to mark the completion of 1,000 days of the Congress government’s “Praja Palana” (People’s Governance) under the leadership of Telangana Chief Minister Sri Revanth Reddy. Sri B. Narayan Rao Patel, the Mudhole constituency in-charge & Ex MLA,participated in the event along with his party workers. Speaking at the event, he requested Mr. Vedma Bojju Patel to release funds for Basara temple. He also criticized the BJP government the about the false promises of creating 2 crore jobs annually, 15lakh in every account. He emphasized that the Congress government has already fulfilled nearly 70% of its election promises.He called upon everyone to work honestly to strengthen the party and keep your personal differences aside. In this program Mr. Mohsin Khan, Block Congress President Shankar Chandra, Mandal Presidents, ATMA Directors, former Sarpanchs, and party workers participated in the event.

నిర్మల్

కుప్టి ఘాట్‌లో ట్రాఫిక్ జామ్‌.. రంగంలోకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్!

స్వయంగా రోడ్డెక్కి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎమ్మెల్యే తాత్కాలిక దారి మళ్లింపునకు జేసీబీతో చర్యలు హైవే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం నెరడిగొండ: నెరడిగొండ మండలంలోని కుప్టి ఘాట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో నియోజకవర్గ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్వయంగా కుప్టి ఘాట్ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఎమ్మెల్యే స్వయంగా బ్రిడ్జిపై నిలబడి వాహనాలను పంపిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం కుప్టి బస్టాప్ వద్ద భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయంగా తాత్కాలిక దారి మళ్లింపు ఏర్పాటుకు జేసీబీ సహాయంతో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా హైవే అధికారుల తీరుపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు తగిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, హైవే అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తానే స్వయంగా కుప్టి ఘాట్‌కు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే చర్యలు చేపట్టానన్నారు. భారీ వాహనాల దారి మళ్లింపు కోసం జేసీబీ సహాయంతో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నామని, మరికొద్దిసేపట్లో ట్రాఫిక్‌ను పూర్తిగా క్లియర్ చేస్తామని తెలిపారు. కుప్టి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం త్వరలో హైదరాబాద్‌లో హైవే అధికారులను కలుస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కుప్టి బ్రిడ్జికి శాశ్వత పరిష్కారం లభించే వరకు సమస్యను వదిలిపెట్టేది లేదని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సమయంలో తక్షణమే స్పందిస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భరోసా ఇచ్చారు.

నిర్మల్

విద్యార్థి గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి

రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యువ వికాసం పథకాలు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ స్కూటీలపై బీఆర్‌ఎస్‌వీ ఆందోళన నిర్మల్: విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విద్యార్థులు, విద్యార్థినులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు హామీ ఇచ్చిన రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, యువ వికాసం పథకం, విద్యార్థులకు నూతన ల్యాప్‌టాప్‌లు, అర్హులైన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించే హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. విద్యా రంగానికి తగిన ప్రాధాన్యత కల్పించి విద్యార్థులకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు గంధర్ రమేష్, రాష్ట్ర మాజీ మైనార్టీ సెక్రటరీ అక్రమాలి, బీఆర్‌ఎస్ మాజీ రాష్ట్ర యువజన సెక్రటరీ కే. సుశీల్ కుమార్ రావు, జిల్లా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎండీ మహబూబ్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర యువజన నాయకులు బి. సాయికుమార్, నిర్మల్ జిల్లా యువజన నాయకులు జుబేర్, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్, నిర్మల్ టౌన్ సెక్రటరీ మసూద్, నయీమ్, బీఆర్‌ఎస్ టౌన్ మైనార్టీ సీనియర్ నాయకులు అయూబ్ ఖాన్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

వికలాంగులు, మహిళల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ కట్టుబాటు

కొండాపూర్: బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగులు, మహిళల సమస్యలు, సంక్షేమం మరియు వారి హక్కులపై అవగాహన కల్పించే కార్యక్రమం కొండాపూర్‌లోని తెలంగాణ బీఆర్‌ఎస్‌ పార్టీ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వికలాంగులు, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్ మారుగొండ రామన్న, మాజీ రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు నజీర్‌ ఖాన్, కె. సుశీల్‌ కుమార్‌ రావు, బీఆర్‌ఎస్‌ మాజీ రాష్ట్ర యువజన కార్యదర్శి, నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుదర్శన్‌, నిర్మల్‌ జిల్లా సీనియర్‌ నాయకులు ఎం.డి. మహబూబ్‌, బీఆర్‌ఎస్‌ నిర్మల్‌ టౌన్‌ సెక్రటరీ నయీమ్‌, నిర్మల్‌ జిల్లా యువజన నాయకులు జుబేర్‌, బి. సాయికుమార్‌, కిరణ్‌ రావు, సోన్‌ మండల యువజన నాయకులు, సోన్‌ మండల సీనియర్‌ నాయకులు నరసయ్య తదితరులు పాల్గొన్నారు. సదస్సులో వికలాంగులు, మహిళల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

నిర్మల్

ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి – CITU డిమాండ్

నిర్మల్, సెప్టెంబర్ 03: వైద్య ఆరోగ్యశాఖలో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. గురువారం డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పని ఒత్తిడిని తగ్గించాలని, ఎల్‌హెచ్‌వీ శిక్షణ ఇప్పించి పెండింగ్ ఇంక్రిమెంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఖర్చుతో ఎల్‌హెచ్‌వీ శిక్షణ ఇప్పించాలని, అర్హత కలిగిన ఏఎన్‌ఎంలకు సూపర్‌వైజర్ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న 1,931 ఎంపిహెచ్‌ఏ ఫిమేల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అన్ని పోస్ట్ ల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నియామకాల్లో మిగిలి పోయిన కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఏఎన్‌ఎంలందరికీ వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని కోరారు. ఆభా లింకింగ్ విధానాన్ని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ Anm యూనియన్ జిల్లా నాయకులు లక్ష్మీ, రాధా, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ రైతు దీక్ష

రెండో రోజు కొనసాగిన నిరసన కార్యక్రమం.. పాల్గొన్న బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నిర్మల్: రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్ష రెండో రోజు కూడా కొనసాగింది. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో బీఆర్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రామన్న, సీనియర్ స్టేట్ మైనార్టీ మాజీ కార్యదర్శి అక్రమాలి, కే. సుశీల్ కుమార్ రావు, బీఆర్‌ఎస్ మాజీ స్టేట్ యూత్ సెక్రటరీ బి. సాయికుమార్, రామకృష్ణ, బీఆర్‌ఎస్ నిర్మల్ జిల్లా యువజన నాయకులు, సీనియర్ నాయకులు మహబూబ్, జిల్లా సీనియర్ నాయకులు షేక్ మునీర్ అహ్మద్, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డి. అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించకుండా, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. రైతు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దీక్షను విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నిర్మల్

ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై రైతు సదస్సు

బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న భారీ రైతు సదస్సు నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరు గ్యారెంటీల వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జ్ కె. రాంకిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3, 2026న ఉదయం 10:30 గంటలకు నిర్మల్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో రైతు సదస్సు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ఆరు గ్యారెంటీల వైఫల్యాలు, రైతులకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కావుపు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, పట్టణాల నుంచి బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నిర్మల్

420 హామీల బ్యానర్‌తో నిర్మల్‌లో బీఆర్‌ఎస్ భారీ ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్మల్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. 420 హామీలకు ప్రతీకగా 420 అడుగుల భారీ బ్యానర్‌తో వినూత్నంగా ఆందోళన చేపట్టారు. బీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. రాంకిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షులు రాము, అయ్యన్నగారి రాజేందర్, మహమ్మద్ నజీరుద్దీన్ తదితరుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడ నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్. సీఎం మహబూబ్. మహమ్మద్ అజీజ్. మినాజ్ ఇంతియాజ్. మసుద్ ఖాన్ ఆయుఖాన్ నయూమ్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

నిర్మల్

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించాలి

నిర్మల్: లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై ఉత్తరాఖండ్‌లో దురుద్దేశపూర్వకంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ గాంధీ పార్క్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు, కార్యకర్తలు, అలాగే పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.