Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

అధికారులపై కౌన్సిలర్ ఆగ్రహం జాకీర్

ఎస్‌ఐఆర్‌ ఫైనల్‌ నోటీసుల కోసం అధికారుల కోసం ఎదురుచూసిన వార్డు ప్రజలు నిర్మల్: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జారీ చేసిన ఎస్‌ఐఆర్‌ ఫైనల్‌ నోటీసులు తీసుకునేందుకు నిర్ణయించిన చివరి తేదీ గురువారం (27న) కావడంతో నోటీసులు అందుకున్న బాధిత కుటుంబాలు సంబంధిత కేంద్రాలకు చేరుకున్నారు. అయితే నిర్ణీత సమయానికి అధికారులు, సిబ్బంది హాజరుకాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆందోళనకు గురయ్యారు. సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే నిర్ణీత కేంద్రాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని బాధిత కుటుంబాలు కోరారు. అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. అధికారులు సమయానికి రాకపోవడంతో కౌన్సిలర్ జాకీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్ణీత సమయాన్ని పాటించడం లేదని ఆరోపించారు. అనంతరం అధికారులు స్పందించి ఎమ్మార్వో రాజు, మున్సిపల్ కమిషనర్ రవి బాబు తదితరులు కేంద్రానికి చేరుకుని ఫైనల్‌ నోటీసులు స్వీకరించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాకీర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎస్‌ఐఆర్‌ నోటీసులు జారీ చేసినప్పటికీ అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు నోటీసులు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ప్రతి వార్డులో అధికారులు స్వయంగా పర్యటించి నోటీసులు అందించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అధికారులు చేయాల్సిన పనులను సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎక్కువగా నిర్వహించాల్సి వచ్చిందని జాకీర్ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. Uploaded Video:

నిర్మల్

ప్రారంభమైన నోటీసుల జారీ ప్రక్రియ నిర్మల్ అర్బన్

గాజులపేట్‌లో ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్ జిల్లా కేంద్రం: నిర్మల్ పట్టణంలోని గాజులపేట్ ప్రాంతంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా పీఎస్ నంబర్లు 191, 192, 193, 194, 195 పరిధిలో BLOలు, VLOలు నోటీసుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ నోటీసులు అందజేస్తూ ఓటర్ల వివరాల పరిశీలన, సవరణలకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించారు. ప్రజలు తమకు జారీ చేసిన నోటీసులను పరిశీలించి, అవసరమైన వివరాలు మరియు పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ BLA మహబూబ్ షేక్, కాంగ్రెస్ పార్టీ BLA నజీమ్ షేక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నోటీసుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు.

నిర్మల్

తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ పర్యటన మరియు ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గార్ల రేపటి పర్యటన వివరాలు

Date 26/08/2026 *తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మరియు AMC చైర్మన్ సోమ బీమ్ రెడ్డి గార్ల రేపటి 27/08/2026 (గురువారం ) పర్యటన వివరాలు.* * ఉదయం 10 గంటలకు సోన్ మండలం కడ్తాల్, మరియు సిద్ధలకుంట ) * 11:00 గంటలకు laxmanchanda మండలం కనకపూర్,బాబాపూర్. * 12 గంటలకుమామడ మండలం కో్రిటికల్, దిమ్మదుర్తి* * * 1:30 గంటలకు నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు గారి క్యాంప్ కార్యాలయంలో తహర్ బిన్ హందన్ గారి ప్రెస్ మీట్ ) * * మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ పట్టణంలోని రెండు వార్డులు . * మధ్యాహ్నం 3:00 గంటలకు దిలావర్పూర్ మండలం కoజర్ మరియు మాడెగo) * మధ్యాహ్నం 4:30 గంటలకు నర్సాపూర్ మండలం టెంబరేణి మరియు నర్సాపూర్ . గ్రామాల్లో పర్యటించి ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలిస్తారు. *KSR Camp office, Nirmal.*

నిర్మల్

మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ నిర్మల్: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త చూపిన ప్రేమ, దయ, సేవా భావాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్మ్ రామ్ కిషన్ రెడ్డి . నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మురుగొండ రాము మరియు డాక్టర్ సుభాష్ రావు మైనార్టీ నాయకులు ఆయుఖాన్.ఇంతియాజ్. అజారుద్దీన్. రిజ్వాన్. జావిద్. మినాజ్. మరియు సోయాబ్ పాల్గొన్నారు

నిర్మల్

ఓటర్లకుS SRI నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్ అర్బన్

Writing ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్: నిర్మల్ అర్బన్ గాజులపేట్ పరిధిలోని పీఎస్ నంబర్లు 191, 192, 193లో ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు మహమ్మద్ రిజ్వాన్, లింగన్న, సాయన్న పాల్గొని ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రియను నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ షేక్ నదీమ్, టీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏ సీఎం మహబూబ్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓటర్ల వివరాల పరిశీలన, నోటీసుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు.

నిర్మల్

నిర్మల్ జిల్లా నిర్మల్ రోలర్ మండల్ న్యూ పోచంపాడు గ్రామ నర్సరీ సందర్శించిన అదన కలెక్టర్ కలెక్టర్

నిర్మల్ మండలంలో గ్రామ నర్సరీని పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ నిర్మల్: నిర్మల్ మండల పరిధిలోని న్యూ పోచంపాడు గ్రామ నర్సరీని జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ పర్యవేక్షించారు. నర్సరీలో మొక్కల పెంపకం, సంరక్షణ, అందుబాటులో ఉన్న మొక్కల వివరాలను పరిశీలించారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. నర్సరీలో మొక్కల పెరుగుదలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఏపీఓ, ఏపీఎం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

నిర్మల్

సమాచార హక్కు చట్ట కమిషనర్ను మర్యాదపూర్వం కలిసిన RTI ప్రతినిధులు

సమాచార హక్కు చట్ట కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన RTI ప్రతినిధులు హైదరాబాద్: సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సయ్యద్ హైదర్ గారు ఈరోజు రాష్ట్ర సమాచార హక్కు చట్ట కమిషనర్ శ్రీ P. V.శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సమాచార హక్కు కమిషన్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కమిటీ ప్రతినిధులు కమిషనర్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ హైదర్ గారితో పాటు కమిటీ ప్రతినిధి శ్రీ అబ్దుల్ సాదిక్ గారు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సమాచార హక్కు చట్టం ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, దరఖాస్తుదారులకు సకాలంలో సమాచారం అందేలా చూడటం మరియు చట్ట పరిరక్షణకు కమిటీ తరఫున తగిన సహకారం అందించడంపై కమిషనర్ గారితో చర్చించారు. ప్రజలకు చట్టంపై మరింత అవగాహన కల్పించేందుకు ఉమ్మడిగా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

నిర్మల్

ధర్మసాగర్ చెరువు అక్రమాలపై కలెక్టర్ స్పందన

ధర్మసాగర్ చెరువు ఆక్రమణలపై కలెక్టర్ స్పందన రెండు వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ EEకి ఆదేశం: సయ్యద్ హైదర్ పత్రికా మిత్రులకు ఆమ్ ఆద్మీ పార్టీ – నిర్మల్ జిల్లా తేదీ: 24-08-2026 | స్థలం: నిర్మల్ నిర్మల్ పట్టణంలోని చారిత్రాత్మక ధర్మసాగర్ చెరువు FTL, బఫర్ జోన్ ఆక్రమణలు, అలాగే చెరువు గర్భంలో అక్రమంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ సమర్పించిన అప్పీల్‌పై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజావాణి) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు నేరుగా అప్పీల్ సమర్పించిన అనంతరం సయ్యద్ హైదర్ విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రజావాణి ద్వారా ధర్మసాగర్ చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు చేయగా, ఇరిగేషన్ అధికారులు నిర్దిష్ట వివరాలతో సమాధానం ఇవ్వకుండా 17 చెరువుల జాబితాను పంపి అసలు అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా నివేదిక సమర్పించారని ఆయన ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌కు అప్పీల్ సమర్పించినట్లు తెలిపారు. అప్పీల్‌ను స్వీకరించిన జిల్లా కలెక్టర్, ధర్మసాగర్ చెరువు FTL ఆక్రమణలు, బఫర్ జోన్ పరిస్థితి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి రెండు వారాల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE)ను ఆదేశించినట్లు సయ్యద్ హైదర్ వెల్లడించారు. ప్రధాన డిమాండ్లు: ధర్మసాగర్ చెరువు FTLను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే చేయాలి. చెరువు బఫర్ జోన్‌లో జరిగిన ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చెరువు గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్‌పై సమగ్ర విచారణ చేపట్టాలి. అక్రమ నిర్మాణం నిర్ధారణ అయితే వాకింగ్ ట్రాక్‌ను తొలగించాలి. గతంలో సమర్పించిన నివేదికపై కూడా సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు నిర్ణీత రెండు వారాల గడువులో సమగ్ర నివేదిక సమర్పించాలని సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. గడువులోగా నివేదిక ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

నిర్మల్

ANTI CORRUPTION వారి ఆధ్వర్యంలో బహిరంగ సభ ర్యాలీ

నిర్మల్ జిల్లా భైంసా లో అవినీతి వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ, బహిరంగ సభ ఈరోజు భైంసా పట్టణంలో Anti Corruption Committee ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ మరియు బహిరంగ సభను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ బ్యాంకెట్ హాల్‌లో జరిగిన బహిరంగ సభలో అవినీతి నిర్మూలన, ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు పారదర్శక పాలన కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ రవీందర్ దేవ్ జీ, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ALOK DWIVEDI, నేషనల్ ఫోక్ పర్సన్ శ్రీ MOHD SAYEED AHMSD, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి MALIKA ANEES FATHIMA, శ్రీ SYED HYDER తదితరులు పాల్గొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా ముందుకు రావాలని, నిజాయితీతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నిర్మల్

మేడిపల్లి రహదారి అభివృద్ధికి రెండు కోట్ల మంజూరు

*మేడిపల్లి రహదారి అభివృద్ధికి రూ.2 కోట్ల మంజూరు* జాతీయ రహదారి NH-44 నుంచి మేడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేసి, మధ్యలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు *రూ.2 కోట్లు మంజూరయ్యాయి.* రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారిని కలిసి *నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కూచాడి శ్రీహరి రావు గారు, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గారు* వినతిపత్రం అందజేశారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారికి శ్రీహరి రావు, సోమ భీమ్ రెడ్డి గార్లు కృతజ్ఞతలు తెలిపారు.