Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో ట్రామా సెంటర్‌ను వెంటనే ప్రారంభించాలి

నిర్మల్ జిల్లా పున్నమి ప్రతినిధి నిర్మల్ : రూ.23.75 కోట్లతో నిర్మాణం పూర్తి.. ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోని వైనం నిర్మల్: నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో 2023–24 సంవత్సరంలో రూ.23.75 కోట్ల వ్యయంతో మంజూరైన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ (ట్రామా సెంటర్) నిర్మాణ పనులు పూర్తై దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడం విచారకరమని ఏ.ఐ.కే.ఆర్ క్యాంప్ కార్యాలయం పేర్కొంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు జిల్లా ఆసుపత్రిని సందర్శించి ట్రామా సెంటర్ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. పేద, సామాన్య ప్రజలకు అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందాలంటే ట్రామా సెంటర్‌ను తక్షణమే ప్రారంభించాలని వారు కోరారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకుని ట్రామా సెంటర్‌ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. – ఏ.ఐ.కే.ఆర్ క్యాంప్ కార్యాలయం, నిర్మల్

నిర్మల్

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎం.ఏ. లతీఫ్‌కే అవకాశం ఇవ్వాలి

పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన సీనియర్ నేతకు గుర్తింపు ఇవ్వాలి: సేవాదళ్ నాయకులు బైంసా: బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మంచిర్యాల జిల్లా పరిశీలకుడు ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించాలని ముధోల్ నియోజకవర్గ సేవాదళ్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బైంసాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆత్మారాం, బైంసా మండల అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా లతీఫ్ చేసిన సేవలను గుర్తించాలని కోరారు. కరోనా సమయంలోనూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, 2023లో పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికీ కాంగ్రెస్‌ను వీడకుండా పార్టీ జెండాను మోస్తూ ప్రజల్లో పనిచేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారితో పాటు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు. ఎం.ఏ. లతీఫ్‌కు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అవకాశం కల్పించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు చేపడతామని సేవాదళ్ నాయకులు హెచ్చరించారు.

నిర్మల్

సీఈసీ రాజీనామా చేయాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

జ్ఞానేశ్ కుమార్ తీరుపై కాంగ్రెస్ నేతల తీవ్ర నిరసన – దిష్టిబొమ్మ దహనం నిర్మల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ, ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాండ్ అలీ పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తదుపరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తమ అభ్యంతరాలను వివరిస్తూ, ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలిచేలా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని వారు కోరారు.

నిర్మల్

నిర్మల్ లో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

నిర్మల్: దేశ ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల సంఘంలోని ఇతర సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ డిమాండ్‌ చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారని పేర్కొన్నారు. జ్ఞానేష్‌ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కూచాడి శ్రీహరి రావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కౌన్సిలర్లు తౌహీద్‌ ఉద్దీన్‌ అలియాస్‌ రఫ్ఫూ, జాకీ, షేక్‌ సల్మాన్‌, మహమ్మద్‌ రఫీ, షేక్‌ ఫిరోజ్‌, షాకీర్‌, షేక్‌ జాకీర్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అస్లాం, మాజీ కౌన్సిలర్‌ సలీం, జఫర్‌, నదీమ్‌ షేక్ తదితర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

నిర్మల్

ఉమ్రి(కె)లో ఘనంగా భగత్ సింగ్ జయంతి. యువతకు స్ఫూర్తిదాయకం భగత్ సింగ్

తానూర్ మండలం: ఉమ్రి కే : భారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుడు సర్దార్ భగత్ సింగ్ జయంతిని తనూర్ మండలం ఉమ్రి(కె) గ్రామంలో యువకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన పోరాటం, ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని యువకులు పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.అనంతరం యువకులు *“ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ యువకులు. చవన్ లక్ష్మణ్ జ్ఞానేశ్వర్ రమేష్ పటిల్ నిఖిల్ పటిల్ దత్తురాం జీవన్ సచిన్ లచ్చారాం, స్థానికులు పాల్గొని అమర వీరుడు భగత్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు.

నిర్మల్

సరస్వతి జలాలను సద్వినియోగం చేసుకోండి రైతులు దేశానికి వెన్నెముక: తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్

వరి పంట పొలాలను తాజా మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్ పరిశీలించడం జరిగింది . సరస్వతి కెనాల్ ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకొని పంటలను సంరక్షించుకో్వాలని సూచించడం జరిగింది . రైతులు దేశానికి వెన్నెముక అని జడ్పీటీసీ కొనియాడారు. వారాబంది పద్ధతిలో సరస్వతి కాలువ నుండి నీరు రావడం జరుగుతుంది జరుగుతుంది కావున రైతులందరూ సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకోవాలని కోరారు.

నిర్మల్

అగ్నిప్రమాదం అనంతరం మళ్లీ ప్రారంభమైన మర్యం జ్యువెలర్స్

యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్‌వీ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ నిర్మల్: ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన మర్యం జ్యువెలర్స్ పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌వీ నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు మిర్జా షోయేబ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడం అభినందనీయమన్నారు. మర్యం జ్యువెలర్స్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని, వినియోగదారుల ఆదరణతో భవిష్యత్తులో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

నిర్మల్

MPPS హంపోలి, కే,లో విద్యార్థులకు దుస్తుల పంపిణీ

బైంసా :హంపోలి కే: MPPS హంపోలి కే పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి పోసాని బాయి (అశోక్) పాల్గొని విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు వారి అవసరాలను గుర్తించి సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె. ప్రవీణ్, పాఠశాల హెడ్‌మాస్టర్ బాలాజీ, ముత్యన్న, VOA హన్మండ్లు, మహిళా సంఘం అధ్యక్షురాలు చంద్రకళ, అలాగే అనసూయ, సరిత, శాంతాబాయి తదితరులు పాల్గొన్నారు.పాఠశాల విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం పట్ల ఉపాధ్యాయులు, మహిళా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

నిర్మల్

సర్దార్ ఖురేషికి ఘన సన్మానం.. అభినందనల వెల్లువ

నిర్మల్: నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికైన సర్దార్ ఖురేషిని బర్కత్‌పుర వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. పార్టీకి, ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ మమ్మద్ రఫీ. ఆసిఫ్ అలీ, అజీజ్, సల్మాన్, సాదిక్, ఫయ్యూం. ఇర్ఫాన్ ఇమ్రాన్. మునీర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

కాంగ్రెస్‌కు అంకితమైన లతీఫ్.. పదవి కోసం కాదు, ప్రజా సేవ కోసం ప్రస్థానం!

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ముధోల్‌లో చర్చ.. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన నాయకుడికి అవకాశం కల్పించాలని కార్యకర్తల ఆకాంక్ష ముధోల్: కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగిస్తూ, పార్టీ బలోపేతంతో పాటు ప్రజా సేవలోనూ తనదైన ముద్ర వేసుకున్న నాయకుడిగా ఎం.ఏ. లతీఫ్ పేరు ముధోల్ నియోజకవర్గ రాజకీయాల్లో వినిపిస్తోంది. 2008లో NSUI సభ్యుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం బైంసా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, నిర్మల్ జిల్లా మైనారిటీ విభాగం జనరల్ సెక్రటరీ, జిల్లా జనరల్ సెక్రటరీ, ముధోల్ నియోజకవర్గ మైనారిటీ ఇన్‌చార్జ్ వంటి పలు బాధ్యతల వరకు కొనసాగింది. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర భారత్ జోడో యాత్ర, హాత్ సే హాత్ జోడో యాత్ర, తిరంగా యాత్రల్లో చురుకుగా పాల్గొన్న లతీఫ్.. బాసర నుంచి కల్లూర్ వరకు 75 కిలోమీటర్ల తిరంగా యాత్రను నిర్వహించారు. దుబ్బాక ఉపఎన్నిక, 2024 ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం అబ్జర్వర్‌గా కొనసాగుతున్నట్లు ఆయన వర్గం తెలిపింది. ప్రజా సేవలోనూ ప్రత్యేక గుర్తింపు కోవిడ్ సమయంలో పేద కుటుంబాలకు రేషన్, పండ్లు, మాస్కులు, శానిటైజర్లు తదితర అవసరమైన సామగ్రిని అందిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. మత, కుల భేదాలకు అతీతంగా అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే తన లక్ష్యమని లతీఫ్ పేర్కొంటున్నారని ఆయన అనుచరులు తెలిపారు. 2023లో ముధోల్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి 2023లో ముధోల్ నియోజకవర్గంలో పార్టీకి సవాళ్లు ఎదురైన సమయంలోనూ కాంగ్రెస్ జెండాను మోస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని ఆయన వర్గం పేర్కొంది. జూన్ 25, 2023న మహా పాదయాత్ర చేపట్టి నియోజకవర్గంలోని ప్రజలను కలుస్తూ పార్టీకి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. అదే ఏడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, టికెట్ బి. నారాయణరావు పాటిల్‌కు దక్కింది. అనంతరం పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఆయన విజయానికి కృషి చేశారని అనుచరులు చెబుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిపై ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లతీఫ్‌కు దక్కుతుందని కార్యకర్తలు ఆశించినప్పటికీ, ఆ అవకాశం ఆనందరావు పాటిల్‌కు దక్కింది. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరం కాకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారని ఆయన వర్గం పేర్కొంది. అక్టోబర్ 23 తర్వాత ఎవరికి అవకాశం? 2026 అక్టోబర్ 23న బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో ఈసారి ఎం.ఏ. లతీఫ్ పేరును పరిశీలించాలని ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కోరుతున్నట్లు ఆయన వర్గం చెబుతోంది. మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ లతీఫ్‌కు అవకాశం ఇవ్వాలని మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన లతీఫ్‌కు ఈసారి అవకాశం దక్కుతుందా? బైంసా మార్కెట్ కమిటీ పీఠం ఎవరిని వరిస్తుంది? అన్నది ప్రస్తుతం ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది.