Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: NIRMAL

నిర్మల్

బాసర మండల అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష… పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు…

బాసర మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని సమస్యలు, పెండింగ్ పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ, విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, శాఖలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. గ్రామపంచాయతీ, వీఓ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

నిర్మల్

ఓటు హక్కుపై కోతలు ఆపాలి.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

నిర్మల్: పున్నమి ప్రతినిధి,:బోగస్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు పేరుతో ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై ఫిర్యాదులు చేసినా తిరిగి చేర్చకపోవడం, కొందరిని మృతులుగా, మరికొందరిని వలస వెళ్లినవారిగా చూపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, వివాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం యువత, విద్యార్థులు, పౌర సమాజం, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఐక్యమై ఉద్యమించాలని సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు. – అబ్దుల్ సాదిక్ | పున్నమి రిపోర్టర్ | నిర్మల్

నిర్మల్

నిర్మల్‌లో ఘనంగా ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం

కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు నిర్మల్: నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరి రావు హాజరై షాపింగ్ మాల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం శ్రీహరి రావును శాలువాతో ఘనంగా సత్కరించింది. నూతనంగా ప్రారంభమైన షాపింగ్ మాల్ ద్వారా ప్రజలకు వివిధ రకాల షాపింగ్ అవసరాలు ఒకే చోట అందుబాటులోకి రావడం సంతోషకరమని శ్రీహరి రావు పేర్కొన్నారు. వ్యాపార రంగంలో షాపింగ్ మాల్ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు సభ కలిమ్ మజర్. పూదరి అరవింద్ మరియు అతికొద్దిన్. మరియు ప్రముఖులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్ ప్రజల అభిమానాన్ని మరువను: శ్రీ లీల

నిర్మల్: నిర్మల్ పట్టణ ప్రజలు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరువనని శ్రీ లీల అన్నారు. నిర్మల్‌లో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీ లీలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తనను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలిరావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. నిర్మల్ ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని శ్రీ లీల పేర్కొన్నారు.

నిర్మల్

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

లక్ష్మణచందా: వివిధ కారణాలతో మృతి చెందిన పలువురు కుటుంబాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మణచందా మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన వినేష్ విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన పుట్టి ముత్తన్న అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే చామన్‌పెల్లి గ్రామానికి చెందిన సింగారం పోశెట్టి పాముకాటుతో మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన సుంకరి ముత్తన్న అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. లక్ష్మణచందా మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బిర్కుల గంగన్న కుటుంబాన్ని, నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన నాంపల్లి మహేందర్ కుటుంబ సభ్యులను కూడా మాజీ మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్, బోరిగాం, చామన్‌పెల్లి సర్పంచులు మల్లికార్జున్ రెడ్డి, అయిట్ల లక్ష్మి–సుదర్శన్, కనకాపూర్, మల్లాపూర్, లక్ష్మణచందా, చామన్‌పెల్లి, పార్పెల్లి మాజీ సర్పంచులు నారాయణ, మేకల రాజేందర్ యాదవ్, కేశం శ్రీనివాస్, గంగాధర్, రాజేందర్, నర్సాపూర్, పార్పెల్లి మాజీ ఎంపీటీసీలు గోవర్ధన్, గణేష్, పీఏ రాజు, బాబాపూర్, చామన్‌పెల్లి ఉప సర్పంచులు సురేష్ రెడ్డి, గంగారెడ్డి, మహిపాల్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసన .భైంసా నిర్మల్ చౌరస్తాలో బీజేపీ, BJYM ఆందోళన

భైంసా: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు, శ్రీరాముడు–పరమశివుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తాలో బీజేపీ, BJYM నాయకులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రధాని, ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతంగా మాట్లాడాలని అన్నారు. శ్రీరాముడు, పరమశివుడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాలని, వారి గురించి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. రాజకీయ విమర్శలకు మత విశ్వాసాలను ముడిపెట్టడం సరికాదని పేర్కొంటూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ, BJYM నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిర్మల్

స్వచ్ఛ నిర్మల్‌కు ప్రజల భాగస్వామ్యం అవసరం – లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్

నిర్మల్, పున్నమి ప్రతినిధి: నిర్మల్ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు భాగస్వాములు కావాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. బుధవారం మినీ ట్యాంక్ బండ్ సమీపంలోని బతుకమ్మ ఘాట్ వద్ద ‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి ప్రదేశాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలతో ప్రజలు ఆరోగ్యంగా జీవించగలరని, ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగించడంతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నిర్మల్: సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ

నిర్మల్: పున్నమి ప్రతినిధి,: నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కుచాడి శ్రీహరి రావు తన క్యాంపు కార్యాలయంలో కొండమడుగు బోజన్నకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద మంజూరైన రూ.60,000 చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. చెక్కు అందుకున్న బోజన్న కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి, శ్రీహరి రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మల్

నిర్మల్ ట్రామా సెంటర్‌ను వెంటనే ప్రారంభించాలి

నిర్మల్ జిల్లా పున్నమి ప్రతినిధి,: నిర్మల్ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్: జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ (ట్రామా) సెంటర్‌ను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. 2023–24 సంవత్సరంలో మంజూరైన ఈ ట్రామా సెంటర్ నిర్మాణ పనులు సుమారు ఆరు నెలల క్రితమే పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ప్రారంభించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ట్రామా సెంటర్‌ను ప్రారంభించడంలో జాప్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారారని, కమిషన్ల కోసమే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే ట్రామా సెంటర్‌ను ప్రారంభించి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమాన్ అలీ, ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పలువురు స్థానిక జిల్లా కాంగ్రెస్ నాయకులు,

నిర్మల్

లోకేశ్వరం–హద్గం రోడ్డా.. నరకానికి నకలా! హామీలు గాలిలో.. గుంతల రహదారిపై ప్రజల అవస్థలు.

### **లోకేశ్వరం–హద్గం రోడ్డా.. నరకానికి నకలా!** #### **హామీలు గాలిలో.. గుంతల రహదారిపై ప్రజల అవస్థలు** లోకేశ్వరం: మండలంలోని లోకేశ్వరం–హద్గం రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు నరకప్రాయంగా మారింది. రహదారిపై అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో గుంతల్లో నీరు చేరడంతో రహదారి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రహదారి నిర్మాణం చేపడతామని హామీలు ఇచ్చారని, అయితే రెండేళ్లు గడిచినా రహదారి పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. రోడ్డు మంజూరైందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాయకుల వెంట తిరిగే కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఒక్కసారి ఈ రహదారిపై ప్రయాణించి వాస్తవ పరిస్థితిని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే రహదారిని పరిశీలించి, మరమ్మతులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హామీలను అమలు చేసి, లోకేశ్వరం–హద్గం రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.