నిర్మల్ జిల్లా పున్నమి ప్రతినిధి,: నిర్మల్ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తేవాలి: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: జిల్లా ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ (ట్రామా) సెంటర్ను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. 2023–24 సంవత్సరంలో మంజూరైన ఈ ట్రామా సెంటర్ నిర్మాణ పనులు సుమారు ఆరు నెలల క్రితమే పూర్తయినప్పటికీ, ఇప్పటివరకు ప్రారంభించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ట్రామా సెంటర్ను ప్రారంభించడంలో జాప్యం చేయడం సరికాదని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారారని, కమిషన్ల కోసమే అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే ట్రామా సెంటర్ను ప్రారంభించి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రి నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమాన్ అలీ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పలువురు స్థానిక జిల్లా కాంగ్రెస్ నాయకులు,





