Saturday, 3 October 2026
  • Home  
  • ఓటు హక్కుపై కోతలు ఆపాలి.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
- నిర్మల్

ఓటు హక్కుపై కోతలు ఆపాలి.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి

నిర్మల్: పున్నమి ప్రతినిధి,:బోగస్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు పేరుతో ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై ఫిర్యాదులు చేసినా తిరిగి చేర్చకపోవడం, కొందరిని మృతులుగా, మరికొందరిని వలస వెళ్లినవారిగా చూపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, వివాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం యువత, విద్యార్థులు, పౌర సమాజం, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఐక్యమై ఉద్యమించాలని సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు. – అబ్దుల్ సాదిక్ | పున్నమి రిపోర్టర్ | నిర్మల్

నిర్మల్: పున్నమి ప్రతినిధి,:బోగస్, డూప్లికేట్ ఓట్ల తొలగింపు పేరుతో ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ ఆరోపించారు.
ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లపై ఫిర్యాదులు చేసినా తిరిగి చేర్చకపోవడం, కొందరిని మృతులుగా, మరికొందరిని వలస వెళ్లినవారిగా చూపడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని, వివాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం యువత, విద్యార్థులు, పౌర సమాజం, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా ఐక్యమై ఉద్యమించాలని సయ్యద్ హైదర్ పిలుపునిచ్చారు.
– అబ్దుల్ సాదిక్ | పున్నమి రిపోర్టర్ | నిర్మల్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.