Friday, 2 October 2026
  • Home  
  • *వైద్యమా..?* *వ్యాపారమా..? ‘ట్రస్ట్’ పేరిట పేదల రక్తం పిండుతున్న కార్పొరేట్ మాఫియా!* ​‘ *బాగుచేస్తాం’ అని చేర్చుకున్నారు.. శవమై తేలేదాకా వదలలేదు!* *​‘సాఫ్ట్‌వేర్ మారింది’ అంటూ సాకులతో లక్షల రూపాయల దోపిడీ* ​ *దివ్యాంగ బిడ్డ భవిష్యత్తును పణంగా పెట్టి అప్పులు తెచ్చినా దక్కని ప్రాణం* ​ *కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ ఎదుట బాధితుల రోదన.. చర్యలకు డిమాండ్*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*వైద్యమా..?* *వ్యాపారమా..? ‘ట్రస్ట్’ పేరిట పేదల రక్తం పిండుతున్న కార్పొరేట్ మాఫియా!* ​‘ *బాగుచేస్తాం’ అని చేర్చుకున్నారు.. శవమై తేలేదాకా వదలలేదు!* *​‘సాఫ్ట్‌వేర్ మారింది’ అంటూ సాకులతో లక్షల రూపాయల దోపిడీ* ​ *దివ్యాంగ బిడ్డ భవిష్యత్తును పణంగా పెట్టి అప్పులు తెచ్చినా దక్కని ప్రాణం* ​ *కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ ఎదుట బాధితుల రోదన.. చర్యలకు డిమాండ్*

​ కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2 (పున్నమి న్యూస్): ప్రాణాలు నిలపాల్సిన వైద్యశాలలు కాసుల కక్కుర్తితో రక్తపింజరులుగా మారుతున్నాయి. ‘ట్రస్ట్’ అనే పవిత్రమైన పేరును బోర్డుపై తగిలించుకుని.. లోపల మాత్రం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్ దారుణం కాకినాడలో వెలుగుచూసింది.మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడతారని నమ్మి వస్తే, సాఫ్ట్‌వేర్ సాకులతో నిలువు దోపిడీ చేసి చివరికి రోగిని బలితీసుకున్నారని అమలాపురానికి చెందిన బాధితురాలు కడలి ఉషారాణి మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు. ​​అమలాపురం పరిసర ప్రాంతానికి చెందిన కడలి ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అమలాపురం, కిమ్స్ ఆసుపత్రుల మీదుగా చివరి ప్రయత్నంగా రోగి ప్రాణాలు నిలబెట్టుకోవాలని కుటుంబ సభ్యులు కాకినాడలోని ట్రస్ట్ హాస్పిటల్‌ను ఆశ్రయించారు. “మీ రోగిని పూర్తిగా బాగుచేసి పంపిస్తాం” అని హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన హామీని నమ్మి చేర్పించారు.అయితే రోజులు గడుస్తున్నా వైద్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోగా పరిస్థితి మరింత విషమించింది. ​​ఐసీయూ, జనరల్ వార్డుల పేరిట నిత్యం వేలాది రూపాయలు వసూలు చేసిన యాజమాన్యం,రోజువారీ బిల్లుల వివరాలు అడిగితే దాటవేత ధోరణి ప్రదర్శించింది. “సాఫ్ట్‌వేర్ మారింది.. సిస్టమ్ అప్‌డేట్ అవుతోంది” అంటూ రోజులు వెళ్లదీసి, చివరకు బిల్లుల బాంబు పేల్చారు. అప్పటికే రూ. 1.50 లక్షల వరకు చెల్లించిన బాధితులకు డిశ్చార్జ్ సమయంలో అమాంతం ఏకంగా మరో రూ. 3 లక్షలకు పైగా బిల్లు కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. పేద రోగి పరిస్థితి ఎలా ఉన్నా, బిల్లుల వసూలే పరమావధిగా వ్యవహరించారనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ​​పేషెంట్ పరిస్థితి విషమించి, నోటి నుంచి సొంగ కారుతూ, మాట పడిపోయిన అత్యంత క్లిష్ట స్థితిలోనూ సిబ్బంది కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారని బాధితురాలు వాపోయారు. “కేవలం నీరసం వల్ల తిండి తినట్లేదంతే” అంటూ నిర్లక్ష్య సమాధానాలతో రోగిని మరింత ప్రాణాపాయంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ​”నాకు 14 ఏళ్ల దివ్యాంగురాలైన కూతురు ఉంది.. నడవలేని స్థితిలో ఉన్న ఆ పిల్లకు రేపటి రోజున దిక్కెవరు అని కూడా ఆలోచించకుండా, నా భర్త బతికితే చాలని రూ. 7 నుంచి 10 లక్షల దాకా అప్పులు తెచ్చి పోశాను. చివరకు ప్రాణాలను గాల్లో కలిపేసి చేతుల్లో లక్షల రూపాయల బిల్లు పెట్టారు..” అంటూ బాధితురాలు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.​సాఫ్ట్‌వేర్ లోపాల సాకులతో పేద ప్రజల నుంచి లక్షల రూపాయలు పిండుకుంటూ, వైద్య విలువలకే మచ్చ తెస్తున్న ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు తక్షణమే దృష్టి సారించాలని ప్రజా సంఘాలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ బిల్లుల దోపిడీ, నిర్లక్ష్యంపై విచారణ కమిటీ వేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గళమెత్తుతున్నారు.

​

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2 (పున్నమి న్యూస్):
ప్రాణాలు నిలపాల్సిన వైద్యశాలలు కాసుల కక్కుర్తితో రక్తపింజరులుగా మారుతున్నాయి. ‘ట్రస్ట్’ అనే పవిత్రమైన పేరును బోర్డుపై తగిలించుకుని.. లోపల మాత్రం రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ జేబులు గుల్ల చేస్తున్న కార్పొరేట్ దారుణం కాకినాడలో వెలుగుచూసింది.మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడతారని నమ్మి వస్తే, సాఫ్ట్‌వేర్ సాకులతో నిలువు దోపిడీ చేసి చివరికి రోగిని బలితీసుకున్నారని అమలాపురానికి చెందిన బాధితురాలు కడలి ఉషారాణి మీడియా ఎదుట కన్నీరుమున్నీరయ్యారు.
​​అమలాపురం పరిసర ప్రాంతానికి చెందిన కడలి ప్రసాద్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అమలాపురం, కిమ్స్ ఆసుపత్రుల మీదుగా చివరి ప్రయత్నంగా రోగి ప్రాణాలు నిలబెట్టుకోవాలని కుటుంబ సభ్యులు కాకినాడలోని ట్రస్ట్ హాస్పిటల్‌ను ఆశ్రయించారు. “మీ రోగిని పూర్తిగా బాగుచేసి పంపిస్తాం” అని హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చిన హామీని నమ్మి చేర్పించారు.అయితే రోజులు గడుస్తున్నా వైద్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోగా పరిస్థితి మరింత విషమించింది.
​​ఐసీయూ, జనరల్ వార్డుల పేరిట నిత్యం వేలాది రూపాయలు వసూలు చేసిన యాజమాన్యం,రోజువారీ బిల్లుల వివరాలు అడిగితే దాటవేత ధోరణి ప్రదర్శించింది. “సాఫ్ట్‌వేర్ మారింది.. సిస్టమ్ అప్‌డేట్ అవుతోంది” అంటూ రోజులు వెళ్లదీసి, చివరకు బిల్లుల బాంబు పేల్చారు. అప్పటికే రూ. 1.50 లక్షల వరకు చెల్లించిన బాధితులకు డిశ్చార్జ్ సమయంలో అమాంతం ఏకంగా మరో రూ. 3 లక్షలకు పైగా బిల్లు కట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. పేద రోగి పరిస్థితి ఎలా ఉన్నా, బిల్లుల వసూలే పరమావధిగా వ్యవహరించారనే విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
​​పేషెంట్ పరిస్థితి విషమించి, నోటి నుంచి సొంగ కారుతూ, మాట పడిపోయిన అత్యంత క్లిష్ట స్థితిలోనూ సిబ్బంది కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారని బాధితురాలు వాపోయారు. “కేవలం నీరసం వల్ల తిండి తినట్లేదంతే” అంటూ నిర్లక్ష్య సమాధానాలతో రోగిని మరింత ప్రాణాపాయంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
​”నాకు 14 ఏళ్ల దివ్యాంగురాలైన కూతురు ఉంది.. నడవలేని స్థితిలో ఉన్న ఆ పిల్లకు రేపటి రోజున దిక్కెవరు అని కూడా ఆలోచించకుండా, నా భర్త బతికితే చాలని రూ. 7 నుంచి 10 లక్షల దాకా అప్పులు తెచ్చి పోశాను. చివరకు ప్రాణాలను గాల్లో కలిపేసి చేతుల్లో లక్షల రూపాయల బిల్లు పెట్టారు..” అంటూ బాధితురాలు రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది.​సాఫ్ట్‌వేర్ లోపాల సాకులతో పేద ప్రజల నుంచి లక్షల రూపాయలు పిండుకుంటూ, వైద్య విలువలకే మచ్చ తెస్తున్న ఇలాంటి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులపై జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు తక్షణమే దృష్టి సారించాలని ప్రజా సంఘాలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ బిల్లుల దోపిడీ, నిర్లక్ష్యంపై విచారణ కమిటీ వేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గళమెత్తుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.