Friday, 2 October 2026
  • Home  
  • జేఎన్టీయూకేలో గాంధీ జయంతి వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జేఎన్టీయూకేలో గాంధీ జయంతి వేడుకలు

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): అలుమ్ని ఆడిటోరియంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి మరియు భారతరత్న, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, రెక్టార్ ప్రొఫెసర్ పి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్. ఆర్.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ ఇన్చార్జి వి. శ్రీనివాసులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. సత్యవేణి గాంధీజీ విగ్రహానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి రెక్టార్ ప్రొఫెసర్ పి. సుబ్బారావు అధ్యక్షత వహించగా, మహాత్మా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను స్మరించారు.ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, శాంతి, అహింస, సత్యాగ్రహం అనే మార్గదర్శక సూత్రాలను ప్రపంచానికి అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని గుర్తుచేశారు.ఆ సూత్రాలు ఈరోజు కూడా సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.అలాగే నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన లాల్ బహదూర్ శాస్త్రి “జై జవాన్, జై కిసాన్” నినాదం నిజమైన భారతీయతను ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మహనీయుల ఆశయాలు ఎల్లప్పుడూ కొత్త తరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా గౌరవ అతిథి ముఖ్యవక్త వాడ్రేవు సుందర్ రావు మాట్లాడుతూ, గాంధీజీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారని తెలిపారు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడని, సత్యం, అహింసలు గాంధీజీ నమ్మే సిద్ధాంతమూలాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని, అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటిచెప్పారని వివరించారు. ఈ సందర్భంగా 250 విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, సంవాద పోటీలు తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వేడుకలో విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, విభాగాధిపతులు, బోధనా మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని గాంధీ, శాస్త్రి ప్రతిమలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
అలుమ్ని ఆడిటోరియంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి మరియు భారతరత్న, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, రెక్టార్ ప్రొఫెసర్ పి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్. ఆర్.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ ఇన్చార్జి వి. శ్రీనివాసులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. సత్యవేణి గాంధీజీ విగ్రహానికి పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి రెక్టార్ ప్రొఫెసర్ పి. సుబ్బారావు అధ్యక్షత వహించగా, మహాత్మా గాంధీ జీవిత చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను స్మరించారు.ఈ సందర్భంగా ఉపకులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, శాంతి, అహింస, సత్యాగ్రహం అనే మార్గదర్శక సూత్రాలను ప్రపంచానికి అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని గుర్తుచేశారు.ఆ సూత్రాలు ఈరోజు కూడా సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.అలాగే నిరాడంబరతకు ప్రతీకగా నిలిచిన లాల్ బహదూర్ శాస్త్రి “జై జవాన్, జై కిసాన్” నినాదం నిజమైన భారతీయతను ప్రతిబింబించిందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మహనీయుల ఆశయాలు ఎల్లప్పుడూ కొత్త తరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.
ఈ సందర్భంగా గౌరవ అతిథి ముఖ్యవక్త వాడ్రేవు సుందర్ రావు మాట్లాడుతూ, గాంధీజీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో జన్మించారని తెలిపారు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడని, సత్యం, అహింసలు గాంధీజీ నమ్మే సిద్ధాంతమూలాలని, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఆయన ఆయుధాలని, అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటిచెప్పారని వివరించారు.
ఈ సందర్భంగా 250 విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, సంవాద పోటీలు తెలుగు, ఆంగ్ల భాషల్లో నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
వేడుకలో విశ్వవిద్యాలయ డైరెక్టర్లు, విభాగాధిపతులు, బోధనా మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని గాంధీ, శాస్త్రి ప్రతిమలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.