Saturday, 3 October 2026
  • Home  
  • భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- అనకాపల్లి

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కలెక్టరేట్‌ వద్ద ఈ నెల 8న మహాధర్నాను జయప్రదం చేయాలి: సీఐటీయూ అనకాపల్లి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. హరిపాలెం, దోసూరు, అచ్చుతాపురం ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికుల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.రాము, మండల కన్వీనర్‌ కే.సోమనాయుడు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ప్రమాద బీమా, ప్రమాదాల్లో అంగవైకల్యం పొందిన వారికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కొత్త కార్మికుల నమోదు, పాత కార్మికుల రెన్యువల్స్‌ చేపట్టడంతో పాటు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అనంతరం అచ్చుతాపురంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ మణికంఠ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజన అప్పలనాయుడు, దోసూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రమేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ వద్ద ఈ నెల 8న మహాధర్నాను జయప్రదం చేయాలి: సీఐటీయూ

అనకాపల్లి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8న కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. హరిపాలెం, దోసూరు, అచ్చుతాపురం ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికుల సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చందక రామకృష్ణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌.రాము, మండల కన్వీనర్‌ కే.సోమనాయుడు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని కోరారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ప్రమాద బీమా, ప్రమాదాల్లో అంగవైకల్యం పొందిన వారికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. కొత్త కార్మికుల నమోదు, పాత కార్మికుల రెన్యువల్స్‌ చేపట్టడంతో పాటు గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
అనంతరం అచ్చుతాపురంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీ మణికంఠ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజన అప్పలనాయుడు, దోసూరు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రమేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.