Thursday, 1 October 2026
  • Home  
  • మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- నిర్మల్

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

లక్ష్మణచందా: వివిధ కారణాలతో మృతి చెందిన పలువురు కుటుంబాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మణచందా మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన వినేష్ విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన పుట్టి ముత్తన్న అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే చామన్‌పెల్లి గ్రామానికి చెందిన సింగారం పోశెట్టి పాముకాటుతో మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన సుంకరి ముత్తన్న అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. లక్ష్మణచందా మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బిర్కుల గంగన్న కుటుంబాన్ని, నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన నాంపల్లి మహేందర్ కుటుంబ సభ్యులను కూడా మాజీ మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్, బోరిగాం, చామన్‌పెల్లి సర్పంచులు మల్లికార్జున్ రెడ్డి, అయిట్ల లక్ష్మి–సుదర్శన్, కనకాపూర్, మల్లాపూర్, లక్ష్మణచందా, చామన్‌పెల్లి, పార్పెల్లి మాజీ సర్పంచులు నారాయణ, మేకల రాజేందర్ యాదవ్, కేశం శ్రీనివాస్, గంగాధర్, రాజేందర్, నర్సాపూర్, పార్పెల్లి మాజీ ఎంపీటీసీలు గోవర్ధన్, గణేష్, పీఏ రాజు, బాబాపూర్, చామన్‌పెల్లి ఉప సర్పంచులు సురేష్ రెడ్డి, గంగారెడ్డి, మహిపాల్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మణచందా: వివిధ కారణాలతో మృతి చెందిన పలువురు కుటుంబాలను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లక్ష్మణచందా మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన వినేష్ విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన పుట్టి ముత్తన్న అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అలాగే చామన్‌పెల్లి గ్రామానికి చెందిన సింగారం పోశెట్టి పాముకాటుతో మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన సుంకరి ముత్తన్న అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. లక్ష్మణచందా మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బిర్కుల గంగన్న కుటుంబాన్ని, నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన నాంపల్లి మహేందర్ కుటుంబ సభ్యులను కూడా మాజీ మంత్రి పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్, బోరిగాం, చామన్‌పెల్లి సర్పంచులు మల్లికార్జున్ రెడ్డి, అయిట్ల లక్ష్మి–సుదర్శన్, కనకాపూర్, మల్లాపూర్, లక్ష్మణచందా, చామన్‌పెల్లి, పార్పెల్లి మాజీ సర్పంచులు నారాయణ, మేకల రాజేందర్ యాదవ్, కేశం శ్రీనివాస్, గంగాధర్, రాజేందర్, నర్సాపూర్, పార్పెల్లి మాజీ ఎంపీటీసీలు గోవర్ధన్, గణేష్, పీఏ రాజు, బాబాపూర్, చామన్‌పెల్లి ఉప సర్పంచులు సురేష్ రెడ్డి, గంగారెడ్డి, మహిపాల్‌తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.