కుబీర్:కుబీర్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల శుక్రవారం ముగింపు సందర్భంగా శనివారం గణనాథుల నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగిస్తూ భారీ శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కుబీర్ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు, పోలీస్ పర్యవేక్షణలో శోభాయాత్ర ప్రశాంతంగా సాగి, గణనాథులను గంగమ్మ ఒడిలోకి నిమజ్జనం చేశారు.



