నిర్మల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
వీరనారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: m. పోశెట్టి
నిర్మల్, సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ ముందర విగ్రహానికి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రజక సంఘం నాయకుడు పోశెట్టి తో పాటు నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె త్యాగం, పోరాట స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. రజక వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, రజక సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

నిర్మల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నిర్మల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు వీరనారి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం: m. పోశెట్టి నిర్మల్, సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ ముందర విగ్రహానికి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రజక సంఘం నాయకుడు పోశెట్టి తో పాటు నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె త్యాగం, పోరాట స్ఫూర్తిని నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. రజక వృత్తిదారుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు, రజక సంఘం సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

